భారత్‌ గురి కుదిరింది.. ప్రపంచకప్‌ షూటింగ్‌లో రెండో పతకం ఖాయం  | ISSF World Cup: Mehuli Ghosh And Shahu Tushar Mane Ensure Second Medal For India | Sakshi
Sakshi News home page

ISSF World Cup: భారత్‌ గురి కుదిరింది.. మెహులి–తుషార్‌ జోడీకి పతకం ఖాయం

Jul 13 2022 7:17 AM | Updated on Jul 13 2022 7:17 AM

ISSF World Cup: Mehuli Ghosh And Shahu Tushar Mane Ensure Second Medal For India - Sakshi

చాంగ్వాన్‌ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ కప్‌లో భారత్‌ గురి కుదిరింది. మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ మెహులి ఘోష్‌– షాహు తుషార్‌ మనే జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ఓడినా... కనీసం రజతమైనా దక్కుతుంది. 60 షాట్ల క్వాలిఫయర్స్‌లో భారత జోడీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 30 జంటలు ఇందులో గురిపెట్టగా... మెహులి–తుషార్‌ ద్వయం 634.4 స్కోరుతో టాప్‌లేపింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, హంగేరి జోడీలు పసిడి పతకం కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో శివ నర్వాల్‌–పాలక్‌ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత పొందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement