టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఐర్లాండ్ జ‌ట్టు ప్ర‌కట‌న‌.. కెప్టెన్ ఎవ‌రంటే? | Ireland T20 World Cup 2024 Squad Announced, Paul Stirling To Lead | Sakshi
Sakshi News home page

Ireland T20 WC Squad: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఐర్లాండ్ జ‌ట్టు ప్ర‌కట‌న‌.. కెప్టెన్ ఎవ‌రంటే?

May 7 2024 10:16 PM | Updated on May 8 2024 9:45 AM

Ireland World Cup squad announced, Paul Stirling to lead

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ మెగా టోర్నీలో ఐరీష్ జ‌ట్టుకు పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహించనున్నాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు స్వ‌దేశంలో పాకిస్తాన్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌, నెదర్లాండ్స్ ,స్కాట్‌లాండ్‌తో జ‌రిగే ట్రై-సిరీస్‌కు ఐర్లాండ్ కూడా తమ జట్టును ప్రకటించింది.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గోనే జ‌ట్టునే ఈ రెండు సిరీస్‌లకు కూడా ఐరీష్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్‌-2024లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఐరీష్ పేస‌ర్ జాషువా లిటిల్‌.. పాక్‌, డ‌చ్‌, స్కాట్‌లాండ్‌తో ట్రై-సిరీస్‌కు దూరం కానున్నాడు.

ఇక ఐరీష్ వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో మాజీ కెప్టెన్ బ‌ల్బ‌ర్నీ, హ్యారీ టెక్టార్, కాంఫ్‌హెర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్ త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 5న టీమిండియాతో త‌ల‌ప‌డ‌నుంది. 

ఐర్లాండ్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

పాక్‌, పాక్‌, డ‌చ్‌, స్కాట్‌లాండ్‌తో ట్రై-సిరీస్‌కు  ఐరీష్ జ‌ట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement