Sara Khadem: ఇరాన్‌లో అడుగుపెడితే చంపేస్తాం.. చెస్‌ ప్లేయర్‌కు బెదిరింపు

Iranian Chess Player Was Warned Not To Return to Iran Without Hijab - Sakshi

ఇరాన్‌కు చెందిన చెస్‌ ప్లేయర్‌ సారా ఖాదిమ్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వెంటనే ఇరాన్‌కు తిరిగి రావాలని డిమాండ్‌ చేస్తుండగా.. మరికొందరేమో ఇరాన్‌ అడుగుపెడితే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సారా ఖాదిమ్‌ తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడంతో కజకిస్తాన్‌ పోలీసుల సహకారంతో చెస్‌ ఆటగాళ్లకు భద్రత కల్పించేందుకు టోర్నమెంట్‌ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా సారా ఖాదిమ్‌ ఉంటున్న హోటల్‌ గది వెలుపల నలుగురు సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు.

ఇరాన్‌కు చెందిన స్టార్‌ చెస్‌ ప్లేయర్‌ సారా ఖాదిమ్‌ ప్రస్తుతం కజికిస్తాన్‌లోని ప్రపంచ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నది. అయితే, చెస్‌ టేబుల్‌పై ఆమె తలకు హిజాబ్‌ ధరించకుండా కూర్చుండి ఆడుతున్న ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆమెకు బెదిరింపు కాల్స్‌ మొదలయ్యాయి. హిజాబ్ ధరించకుండా చెస్‌ పోటీల్లో ఎలా పాల్గొంటామని ఆకతాయిలు హెచ్చరిస్తున్నారు. పోటీలను అర్దాంతరంగా ముగించి వెంటనే స్వదేశానికి రావాలని కొందరు హెచ్చరిస్తుండగా.. మరికొందరేమో ఇక్కడికి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top