ఐపీఎల్-2026 ఎలిమినేటర్‌లో భాగంగా చండీగఢ్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో అమీతుమీ తెల్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించాలని ఎస్‌ఆర్‌హెచ్ పట్టుదలతో ఉంది. ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ రెండు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
మిడిలార్డర్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌ను పక్కన పెట్టాలని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్మరణ్‌కు గత కొన్ని మ్యాచ్‌లలో అవకాశం లభించినప్పటికి సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టి ఫినిషర్ అనికేత్ వర్మను తుది జట్టులోకి తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తుందంట.
అనికేత్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. 2025 సీజన్‌లో దుమ్ములేపిన అనికేత్.. ప్రస్తుత సీజన్‌లో మాత్రం విఫలమయ్యాడు. 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 79 పరుగులు చేశాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన ఎస్ఆర్‌హెచ్ మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎస్ఆర్‌హెచ్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిన హర్షల్ పటేల్‌ను కూడా తిరిగి బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అతడి స్ధానంలో యువ పేసర్ ప్రపుల్ హింగేకు అవకాశమివ్వన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎస్ఆర్‌హెచ్‌దే పై చేయి
ఈ సీజన్ లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు, జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆర్‌ఆర్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు అదే జోరును ఎలిమినేటర్‌లో కొనసాగించాలని కమ్మిన్స్ సేన ఉవ్విళ్లూరుతోంది.
రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.
ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
చదవండి: IPL 2026: గుజరాత్ కొంపముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే?


