
Photo Courtesy: BCCI
భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారికంగా ప్రకటించింది. యుద్ద పరిస్థితుల్లో లీగ్‌ను కొనసాగించలేమని చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఐపీఎల్ 2025 భవితవ్యాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు
నిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.
ఈ మ్యాచ్‌పై ప్రస్తుతానికి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారా లేక ఫ్రెష్‌గా మరో మ్యాచ్‌ను స్టార్ట్ చేస్తారా లేక ఆగిపోయిన దగ్గరి నుంచే కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
వాయిదా ప్రకటనకు ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది
57 మ్యాచ్‌ల పాటు సజావుగా సాగిన ఐపీఎల్ 2025.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్ మధ్యలో బ్రేక్ పడింది. వాయిదా ప్రకటనకు ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇలా ఉంది.
పాయింట్ల పట్టిక..

అత్యధిక పరుగులు..

అత్యధిక వికెట్లు..
