IPL 2023: అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్‌

IPL 2023 Mini Auction: Manjrekar Backs Mayank Franchises Vie For Him - Sakshi

IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్‌-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్‌ను విడుదల చేసింది పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ. గత సీజన్‌లో తమ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌కు గుడ్‌ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.

ఈ క్రమంలో పంజాబ్‌ రిటెన్షన్‌ జాబితాలోలేని మయాంక్‌ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు.


సంజయ్‌ మంజ్రేకర్‌(PC: Sanjay Manjrekar Twitter)

మయాంక్‌ కోసం పోటీ ఎందుకంటే
అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్‌లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్‌ అగర్వాల్‌ విషయం కాస్త భిన్నం. 

అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్‌ అగర్వాల్‌ మంచి ఆటగాడు. 

ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు
ఎంత మంచి వాడంటే.. కెప్టెన్‌గా ఉన్నపుడు తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్‌ అయిన తర్వాత టాపార్డర్‌లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్‌ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. 

దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్‌ కోసం పోటీ పడటం ఖాయం.

150, 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్‌ చేయగల.. స్పిన్‌, పేస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్‌ బ్యాటర్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్‌ స్పోర్ట్స్ షోలో సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ సారథిగా వ్యవహరించిన మయాంక్‌.. 13 ఇన్నింగ్స్‌ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్‌గా పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. 

చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
Kane Williamson: నన్ను రిలీజ్‌ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్‌ మామ భావోద్వేగం
IPL 2023 Retention: స్టార్‌ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్‌ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top