IPL 2023: #JioCrash తొలిరోజే అట్టర్‌ప్లాఫ్‌ .. ఏకిపారేసిన అభిమానులు

IPL 2023: JioCrash Trends Twitter Day 1 Viewers Complain Buffering Issue - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్‌ను ప్రసారం చేసే హక్కులను రెండు సంస్థలు తీసుకున్నాయి. టీవీ రైట్స్‌ను డిస్నీ స్టార్‌ దక్కించుకోవగా.. డిజిటిల్‌ సహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రైట్స్‌ను రిలయన్స్‌ అనుబంధ సంస్థ వయాకామ్‌ 18 కొనుగోలు చేసింది. డిస్నీ స్టార్‌ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తే.. వయాకామ్‌ 18 మ్యాచ్‌లను జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది.

ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం ఇవ్వడం మంచిదే అయినప్పటికి అభిమానులకు తొలిరోజే జియో సినిమాలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. తొలి రోజు గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో ఇరజట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి.  ఇరుజట్ల ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే జియో సినిమాలో మ్యాచ్‌ చూసినవారికి మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ప్రతి పది నిమిషాలకోసారి సైట్‌ క్రాష్‌ అవడం లేదా బఫర్‌ అవడం జరిగింది. అభిమానులకు ఇది తలనొప్పిగా మారి మ్యాచ్‌ను కూడా సరిగ్గా వీక్షించలేకపోయారు.

దీంతో జియో సినిమాపై అభిమానులు ట్విటర్‌ వేదికగా ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు.  తొలిరోజే జియో సినిమా యాప్‌ అట్టర్‌ప్లాఫ్‌ అయింది.. పదేపదే అంతరాయం కలిగిస్తూ మ్యాచ్‌ చూడకుండా చేసింది.. వెరీ బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ విత్‌ జియో సినిమా.. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఇదో కొత్త రూల్‌ అనుకుంటా.. ప్రతి 15 సెకన్లకు రీప్రెష్‌ చేయాల్సి వచ్చింది.. బఫరింగ్‌.. బఫరింగ్‌.. బఫరింగ్‌ ఇది తప్ప ఇంకేమి కనిపించలేదు అంటూ విరుచుకుపడ్డారు.

చదవండి: '#Ee sala Cup Nahi'.. జట్టు కెప్టెన్‌ అయ్యుండి ఆ మాట అనొచ్చా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top