KL Rahul LSG: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌! కష్టమే..

IPL 2023: Big Blow For KL Rahul LSG Star Pacer To Miss Majority Matches - Sakshi

IPL 2023- Lucknow Super Giants: ఐపీఎల్‌-2023 టోర్నీ ఆరంభానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లక్నో స్టార్‌ పేసర్‌ మొహ్సిన్‌ ఖాన్‌ జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎడమ భుజానికి గాయమైన నేపథ్యంలో మొహ్సిన్‌ గతేడాది సర్జరీ చేయించుకున్నాడు. చికిత్సలో భాగంగా బ్లడ్‌ క్లాట్స్‌ తొలగించినప్పటికీ అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం. 

ఈ క్రమంలో ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు మొహ్సిన్‌ ఖాన్‌ దూరం కానున్నట్లు ఈఎస్‌పీఎన్‌ కథనం పేర్కొంది. కాగా అన్‌క్యాప్డ్‌ పేసర్‌ మొహ్సిన్‌ ఖాన్‌ గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

పొదుపైన బౌలింగ్‌తో
లక్నో తరఫున బరిలోకి దిగిన అతడు తొమ్మిది మ్యాచ్‌లలో 5.97 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 4/16. కీలక సమయంలో రాణించిన మొహ్సిన్‌ ఖాన్‌ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అరంగేట్ర సీజన్‌లోనే లక్నో ప్లే ఆఫ్స్‌ చేరడంలో తన వంతు సహాయం అందించాడు.

అయితే, సీజన్‌ ఆఖర్లో భుజం నొప్పితో జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరిన మొహ్సిన్‌ అక్కడే చికిత్స పొందాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2023కు సిద్ధమవుతున్న జట్టుతో చేరిన అతడు.. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ ఇంతవరకు బౌలింగ్‌ మాత్రం చేయలేదు.

ఇదిలా ఉంటే ఇప్పటికే మొహ్సిన్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు లక్నో జయదేవ్‌ ఉనాద్కట్‌ను సిద్ధం చేసింది. గతేడాది వేలంలో భాగంగా ఈ సౌరాష్ట్ర పేసర్‌ను దక్కించుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ ప్రయాణం ఆరంభించనుంది.

యూపీ నుంచి వచ్చి..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన మొహ్సిన్‌ ఖాన్‌ 2019లోనే ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే, మూడు సీజన్ల పాటు అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈక్రమంలో తీవ్ర నిరాశకు గురైనప్పటికీ.. ముంబై వంటి మేటి జట్టులో అంత సులువుగా అవకాశం దక్కదు కాబట్టి తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాడు మొహ్సిన్‌ ఖాన్‌.

ఈ నేపథ్యంలో లక్నో రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఈ జట్టులోనూ ఆరంభ మ్యాచ్‌లలో అవకాశం రానప్పటికీ.. ఓపికగా ఎదురుచూశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పుడు గాయం కారణంగా మరోసారి ఆటకు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.

చదవండి: ఐపీఎల్‌-2023కు దూరం కానున్న స్టార్‌ ఆటగాళ్లు వీరే..!
WC Super League Standings: శ్రీలంక ఆశలు ఆవిరి.. టాప్‌కు చేరిన న్యూజిలాండ్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

31-03-2023
Mar 31, 2023, 10:11 IST
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను...
31-03-2023
Mar 31, 2023, 09:28 IST
క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పేరుంది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌...
31-03-2023
Mar 31, 2023, 09:21 IST
టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌కు బంపరాఫర్‌ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించే అవకాశం కార్తీక్‌కు...
31-03-2023
Mar 31, 2023, 05:01 IST
ధోని చెన్నైలో ఆఖరిసారిగా ఆడి ఇక గుడ్‌బై చెబుతాడా? ఎన్నో రికార్డులు అందుకున్నా ఇంకా చెంత చేరని ఐపీఎల్‌ ట్రోఫీని ఈ సారైనా...
31-03-2023
Mar 31, 2023, 02:11 IST
క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2023 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్‌ వేదికగా...
30-03-2023
Mar 30, 2023, 21:12 IST
ఐపీఎల్‌-2023 మహాసంగ్రామం మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌...
30-03-2023
Mar 30, 2023, 20:53 IST
ఇప్పటికే రష్మిక అహ్మదాబాద్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర
30-03-2023
Mar 30, 2023, 18:27 IST
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...
30-03-2023
Mar 30, 2023, 17:09 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నైసూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌...
30-03-2023
Mar 30, 2023, 15:34 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైం‍ది. క్రికెట్‌ అభిమానులను ఊర్రుతూలూగించే ఈ ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ శుక్రవారం(మార్చి 31) నుంచి ప్రారంభం...
30-03-2023
Mar 30, 2023, 14:52 IST
ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్‌ న్యూస్‌. ముంబై సారథి రోహిత్‌ శర్మ ఈ ఏడాది...
30-03-2023
Mar 30, 2023, 14:24 IST
IPL 2023 Winner Prediction: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై...
30-03-2023
Mar 30, 2023, 13:24 IST
IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఈ క్యాష్‌...
30-03-2023
Mar 30, 2023, 12:00 IST
IPL 2023- Orange Cap Holder Prediction: ‘‘నేనైతే ఆరెంజ్‌ క్యాప్‌ అతడికే దక్కుతుంది అనుకుంటున్నా. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ...
30-03-2023
Mar 30, 2023, 09:38 IST
''అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్‌లోనే ఉన్నా.. ఐపీఎల్‌ ఆడడానికి వస్తున్నా''.. పంత్‌ చేసిన వ్యాఖ్యలివి. పంత్‌  మాటలు వినగానే ఒక్క...
30-03-2023
Mar 30, 2023, 08:54 IST
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) ప్రతీసారి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. కారణం విరాట్‌ కోహ్లి. అతని బ్రాండ్‌ జట్టును ఎప్పుడు స్టార్‌...
30-03-2023
Mar 30, 2023, 08:24 IST
మార్చి 31న ఐపీఎల్‌ 16వ సీజన్‌కు తెరలేవనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌...
30-03-2023
Mar 30, 2023, 00:41 IST
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్‌లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌...
29-03-2023
Mar 29, 2023, 18:09 IST
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో టీ20...
29-03-2023
Mar 29, 2023, 17:25 IST
IPL 2023- David Warner: ‘‘డేవీ అద్భుతమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్‌గా తనకు బాధ్యతలు అప్పగిస్తే... 

Read also in:
Back to Top