
CSK VS PBK: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగనున్న కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ను ఓ ఆసక్తికర రికార్డు ఊరిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్ల రికార్డు (660) తన పేరిట లిఖించుకున్న గబ్బర్.. నేటి మ్యాచ్‌లో మరో 7 బౌండరీలు సాధిస్తే.. టీ20 ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. టీ20ల్లో అత్యధిక ఫోర్లు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ధవన్ 993 ఫోర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి 917 ఫోర్లతో రెండో ప్లేస్‌లో, రోహిత్ శర్మ 875 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో యూనివర్సల్ బాస్..1132 ఫోర్లతో మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (1054 ఫోర్లు), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1005), ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (998) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కింగ్స్ ఫైట్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. లీగ్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు ఆడగా, పంజాబ్ ఓ గెలుపు (ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో విజయం), మరో మ్యాచ్‌లో పరాజయం (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి) మూటగట్టుకోగా.. సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి, లక్నో చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం) ఓటమిపాలై బోణీ విజయం కోసం తహతహలాడుతుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడగా, చెన్నై15, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి.
తుది జట్లు (అంచనా):
చెన్నైసూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, భానుక రాజపక్స, రాజ్ బవా, షారూక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియన్ స్మిత్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: IPL 2022: 'కింగ్స్' ఫైట్.. ధోనిని ఊరిస్తున్న సిక్సర్ల రికార్డు