Breadcrumb
Live Updates
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో మాక్స్వెల్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ మూడు, రాహుల్ చాహర్, రిషిదావన్ చెరో రెండు, హార్ప్రీత్ బ్రార్, ఆర్షదీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో హార్షల్ పటేల్ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ చెరో వికెట్ సాధించారు.
17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 137/8
17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ 137 పరుగులు చేసింది.
ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
120 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కార్తీక్.. ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో రాజపాక్సకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ : 120/6
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. మాక్స్వెల్ ఔట్
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మాక్స్వెల్.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో.. ఆర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్: 109/5
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
104 పరుగుల ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన పాటిదార్.. చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 104/4
8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 71/3
8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్వెల్(19), పాటిదార్(12) ఉన్నారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. రిషి ధావన్ వేసిన రెండో ఓవర్లో.. డుప్లెసిస్(10), లోమ్రోర్(6) పెవిలియన్‌కు చేరారు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 41/3
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్
33 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రబాడ బౌలింగ్‌లో చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 19/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), డుప్లెసిస్(6) పరుగులతో ఉన్నారు.
చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ 210 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు.
ఆర్సీబీ బౌలర్లలో హార్షల్ పటేల్ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ చెరో వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
164 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ... హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
152 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 152/4
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్..
101 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 105/3
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
85 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది.హాసరంగా బౌలింగ్‌లో రాజపాక్స(1) ఔటయ్యాడు.
చెలరేగి ఆడుతోన్న పంజాబ్.. 6ఓవర్లకు 83/1
6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి పంజాబ్ కింగ్స్ 83 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో చెలరేగి ఆడుతున్నాడు. 21 బంతుల్లొ అర్ధసెంచరీ సాధించాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
60 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన ధావన్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో బెయిర్ స్టో(37), రాజపక్స ఉన్నారు.
రెండు ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్: 30/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(27), ధావన్(2) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
ఐపీఎల్-2022లో భాగంగా బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఆర్సీబీ
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
Related News By Category
Related News By Tags
-
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8...
-
IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్‌లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj ...
-
ఆసీస్ భారీ స్కోర్.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస...
-
చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు
భారత ఔట్ డేటెడ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2025లో (County Championship) సర్రే (Surrey) తరఫున అర...
-
కేకేఆర్‌పై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడం, ఆతర్వాత అర్హుడైన అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌కు ఇండియా-ఏ కెప్టెన్‌గా ఎంపిక కావడం వంటి అంశాల ద్వారా టీమిండియా మిడిలార్డర్ ఆ...


