
Breadcrumb
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్తాన్ రాయల్స్ విజయం
Apr 10 2022 7:04 PM | Updated on Apr 10 2022 11:39 PM

Live Updates
IPL 2022: రాజస్తాన్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్తాన్ రాయల్స్ విజయం
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ 39 పరుగులు చేయగా.. స్టోయినిస్ 38 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచినా లక్నోను గెలిపించలేకపోయాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ 4, బౌల్ట్ 2, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ చెరొక వికెట్ తీశారు.
ఆరో వికెట్ డౌన్.. ఓటమి దిశగా లక్నో సూపర్ జెయింట్స్
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఓటమి దిశగా పయనిస్తోంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన డికాక్ చహల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నాలుగో వికెట్ డౌన్.. కష్టాల్లో లక్నో సూపర్ జెయింట్స్
దీపక్ హుడా(25) రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో దీపక్ హుడా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
19 పరుగులకే మూడు వికెట్లు డౌన్
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ బౌల్ట్ వేసిన తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్ రెండో బంతికి కె గౌతమ్ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 8 పరుగులు చేసిన జాసన్ హోల్డర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 3 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది.
హెట్‌మైర్ మెరుపులు.. రాజస్తాన్ రాయల్స్ 165/6
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్‌మైర్ 36 బంతుల్లో ఒక ఫోర్, ఆరు సిక్సర్లతో 59 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దేవదత్ పడిక్కల్ 29 పరుగులు చేయగా.. అశ్విన్ 28 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
17 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 115/4
17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. హెట్‌మైర్ 21 , అశ్విన్ 26 పరుగులతో ఆడుతున్నారు.
కృష్ణప్ప గౌతమ్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కె గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతికి పడిక్కల్(29)ఔట్ కాగా.. ఐదో బంతికి వాండర్ డుసెన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్తాన్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.
8 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 58/1
8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. పడిక్కల్ 28, శాంసన్ 12 పరుగులతో ఆడుతున్నారు.
బట్లర్(13) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
సూపర్ ఫామ్‌లో ఉన్న జాస్ బట్లర్ 13 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. పడిక్కల్ 25, శాంసన్ 2 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో రాజస్తాన్ 39/0
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. పడిక్కల్ 24, జాస్ బట్లర్ 12 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌లు బలంగా కనిపిస్తున్నాయి. లక్నో తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఒక పరాజయం చూసింది. అదే సమయంలో రాజస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి ఒక మ్యాచ్ ఓడింది.
Related News By Category
Related News By Tags
-
స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నోకు షాక్!
IPL 2022 RR Vs LSG- ముంబై: ఐపీఎల్లో ‘హ్యాట్రిక్’ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్‌జెయింట్స్ జోరుకు బ్రేక్ పడింది. రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ముందు లక్నో తలవంచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ర...
-
#RRvsLSG: సిక్సర్ల వర్షం.. వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమే!?
#Sanju Samson vs KL Rahul: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్-2024 ఎడిషన్‌ను అద్భుతమైన విజయంతో ఆరంభించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో అదరగొట్టి ప్రశంసలు అందుకుంటు...
-
RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం
IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ...
-
రాజస్తాన్‌పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిం...
-
RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..?
ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్‌లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 19) ఓ రసవత్తర సమరం జరుగనుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్ జట్ల మధ్...