Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ వర్సెస్ చెన్నై లైవ్ అప్డేట్స్
రాణించిన సాహా.. గుజరాత్ ఖాతాలో మరో విజయం
134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాహా (57 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ మరో 5 బంతులు మిగిలుండగానే సీజన్లో 10 విజయాన్ని నమోదు చేసింది. సీఎస్కే బౌలర్లలో కొత్త కుర్రాడు మతీష పతిరన 2 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకంతో రాణించడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. జగదీషన్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించగా.. ధోని (10 బంతుల్లో 7) దారుణంగా నిరుత్సాహపరిచాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. షమీ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, సాయికిషోర్ తలో వికెట్ సాధించారు.
మరో దెబ్బేసిన పతిరన
కొత్త బౌలర్ పతిరన.. గుజరాత్ టైటాన్స్‌ను మరో దెబ్బ కొట్టాడు. అంతకుముందు మొయిన్ అలీని ఎల్బీడబ్ల్యూ చేసిన పతిరన.. హార్ధిక్ పాండ్యా (7)ను కూడా ఔట్ చేశాడు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 104/3. క్రీజ్‌లో సాహా (50), మిల్లర్ (1) ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. వేడ్ ఔట్
విజయం దిశగా అడుగులు వేస్తున్న గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వేడ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 11.2 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 90/2. క్రీజ్‌లో సాహా (46), హార్ధిక్ పాండ్యా ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
134 పరుగల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు సాహా (26 బంతుల్లో 40; 7 ఫోర్లు, సిక్స్), గిల్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి ధాటికి గుజరాత్ స్కోర్ 6 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.
అయితే 8వ ఓవర్ తొలి బంతికి కొత్త బౌలర్ మతీష పతిరన గుజరాత్‌ను భారీ దెబ్బ కొట్టాడు. అప్పుడప్పుడే కుదురుకుంటున్న గిల్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి వెనక్కు పంపాడు. . 8 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 71/1. క్రీజ్‌లో సాహా (40), వేడ్ (11) ఉన్నారు.
రాణించిన రుతురాజ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన సీఎస్కే
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకంతో రాణించడంతో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. జగదీషన్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించగా.. ధోని (10 బంతుల్లో 7) దారుణంగా నిరుత్సాహపరిచాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. షమీ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, సాయికిషోర్ తలో వికెట్ సాధించారు. షమీ వేసిన ఆఖరి ఓవర్లో ధోని.. యశ్ దయాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దూబే డకౌట్
రుతురాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన శివమ్ దూబే డకౌటయ్యాడు. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి దూబే ఔటయ్యాడు.
రుతురాజ్‌ను బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్
నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 113/3. జగదీషన్ (30), శివమ్ దూబే క్రీజ్‌లో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న రుతురాజ్
ఈ సీజన్లో రుతురాజ్ (46) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో జగదీషన్ (13 బంతుల్లో 14; 2 ఫోర్లు) నిదానంగా ఆడుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 90/2.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. మొయిన్ అలీ ఔట్
ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతికి మొయిన్ అలీ (17 బంతుల్లో 21; 2 సిక్సర్లు) ఔటయ్యాడు. సాయికిషోర్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో మొయిన్ అలీ పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 73/2. క్రీజ్‌లో రుతురాజ్ (30 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), జగదీషన్ (4 బంతుల్లో 5; ఫోర్) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే.. ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీస్ హీరో డెవాన్ కాన్వే 9 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. షమీ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి కాన్వే ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 30/1. క్రీజ్‌లో రుతురాజ్ (20), మొయిన్ అలీ (4) ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
తుది జట్లు..
సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివం దూబే, ఎన్ జగదీషన్, ఎంఎస్ ధోని(కెప్టెన్), మిచెల్ సాండ్నర్, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్‌జిత్ సింగ్, మతీష పతిరన, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
Related News By Category
Related News By Tags
-
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది...
-
IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు మంది ఆటగాళ్లను వదిలేసింది. క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (...
-
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పా...
-
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల...
-
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్‌కు ముందు పతాక శీర్షికలకెక్కే న...


