ఐపీఎల్‌లో డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర | IPL 2022: Dwayne Bravo Bags Top Place Most Wicket Taker In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర

Mar 31 2022 11:27 PM | Updated on Apr 1 2022 8:11 AM

IPL 2022: Dwayne Bravo Bags Top Place Most Wicket Taker In IPL History - Sakshi

PC: IPL/BCCI

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఇండియన్‌ ఐపీఎల్‌లో చరిత్ర సృష్ఠించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్‌ హుడాను ఔట్‌ చేయడం ద్వారా బ్రావో ఐపీఎల్‌లో 171వ వికెట్‌ సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్‌ బ్రావో కొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో బ్రావో ముంబై ఇండియన్స్‌ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ (170) రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఐపీఎల్‌ టాప్‌ ఐదు వికెట్‌ టేకర్స్‌ జాబితాను పరిశీలిస్తే.. బ్రావో(171 వికెట్లు), మలింగ(170 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత అమిత్‌ మిశ్రా (166), పియుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150)లు ఉన్నారు.

చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్‌కేకే సాధ్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement