ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ; బోణీ కొట్టాలన్న పట్టుదలతో సన్‌రైజర్స్‌! | IPL 2021 SRH To Face RCB Today Match What Changes Will Be Done | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ; బోణీ కొట్టాలన్న పట్టుదలతో సన్‌రైజర్స్‌!

Apr 14 2021 8:27 AM | Updated on Apr 14 2021 12:51 PM

IPL 2021 SRH To Face RCB Today Match What Changes Will Be Done - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే మినహా మిగతా వారు విఫలమయ్యారు.

చెన్నై: ఐపీఎల్‌ తాజా సీజన్‌ను గెలుపుతో ఘనంగా ఆరంభించాలనుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది. రెండు రోజుల విరామం అనంతరం లీగ్‌లో రెండో పోరుకు హైదరాబాద్‌ సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్‌లో కోహ్లి నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో డిఫెండింగ్‌ చాంపియన్‌ను బోల్తా కొట్టించిన బెంగళూరు మరో గెలుపుపై కన్నేయగా ... సరైన వ్యూహాలతో బరిలోకి దిగి పాయింట్ల ఖాతాను తెరిచేందుకు వార్నర్‌ బృందం పట్టుదలగా ఉంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో మరోమారు అభిమానులకు పరుగుల విందు లభించడం ఖాయం.

కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే మినహా మిగతా వారు విఫలమయ్యారు. విలియమ్సన్‌ ఇంకా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను సాధించలేదని కోచ్‌ బేలిస్‌ తెలియజేయడంతో అతడు ఈ మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. అయితే వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ రూపంలో హైదరాబాద్‌కు ఊరట లభించనుంది. అతడు తన తప్పనిసరి క్వారంటైన్‌ ముగించుకోవడంతో... బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో నబీ స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది. మరోవైపు సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైను ఓడించడం ద్వారా బెంగళూరు టీమ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. గత మ్యాచ్‌కు దూరమైన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ మ్యాచ్‌లో రజత్‌ పటిదార్‌ స్థానంలో బరిలోకి దిగొచ్చు. 

చదవండి: రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ: ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ అవుట్
కోల్‌కతా... చేజేతులా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement