శ్రేయస్‌ అ‍య్యర్‌కు పాంటింగ్‌ ఆహ్వానం..!

IPL 2021: Ricky Ponting Invites Shreyas Iyer For 12th Man - Sakshi

ముంబై:  ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌-14 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్‌‌.. లీగ్‌ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.  కాగా, మూడు రోజుల క్రితం అయ్యర్‌ సర్జరీ చేయించుకున్నాడు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని, త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.  అయ్యర్‌కు సుమారు నాలుగు నెలలు విశ్రాంతి అవసరం కావడంతో అతను మళ్లీ క్రికెట్‌ ఫీల్డ్‌లో దిగడానికి చాలా సమయమే ఉంది. 

కాగా, నిన్న సీఎస్‌కేతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌..శ్రేయస్‌ అయ్యర్‌ను వర్చువల్‌ కాల్‌లో ముచ్చటించాడు. తొలుత పలువురు ఢిల్లీ ఆటగాళ్లు అయ‍్యర్‌ను విష్‌ చేయగా, ఆ తర్వాత పాంటింగ్‌ మాట్లాడాడు.  ఈ క్రమంలోనే తమతో జాయిన్‌ కావాలని పాంటింగ్‌ రిక్వెస్ట్‌ చేశాడు.  శస్త్ర చికిత్స తర్వాత భుజం ఎలా ఉందని ముందుగా అడిగిన పాంటింగ్‌.. వచ్చి జట్టుతో కలవమన్నాడు. ‘ అంతా ఓకేనా..  ఓహ్‌ నీ హెయిర్‌ స్టైల్‌ బాగుంది. వచ్చి జట్టుతో కలవచ్చు కదా.  కేవలం ఏడు రోజులే క్వారంటైన్‌. క్వారంటైన్‌ అనేది చాలా తొందరగా అయిపోతుంది. నన్ను నమ్ము. 12వ ఆటగాడిగా జట్టుతో ఉండు’ అంటూ అయ్యర్‌తో పాంటింగ్‌ సరదాగా చమత్కరించాడు. 

ఇక్కడ చదవండి: ఆఫ్‌ స్పిన్‌ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా!

నన్ను బాధించింది.. ఇక ఆలోచించడం లేదు: పృథ్వీ షా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top