అందుకే మయాంక్‌ను పక్కనపెట్టాం: కేఎల్‌ రాహుల్‌

IPL 2021: KL Rahul Reveals Why Mayank Agarwal Is Not In Team VS RCB - Sakshi

అహ్మదాబాద్‌: ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాన్ని కేఎల్‌ రాహుల్‌ రివీల్‌ చేశాడు. కాగా టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక టాస్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ జట్టులో మార్పుల గురించి ప్రస్తావించాడు.

'ఈ మ్యాచ్‌కు మయాంక్‌ను పక్కనబెట్టడానికి ఒక కారణం ఉంది. కేకేఆర్‌తో జరిగిన​ మ్యాచ్‌లోనే మయాంక్‌ స్వల్ప గాయంతో బరిలోకి దిగాడు. అయితే అతని గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు తీసుకోలేదు. మయాంక్‌తో పాటు జట్టులో మరో రెండు మార్పులు చేశాం. హెన్రిక్స్‌, అర్షదీప్‌ స్థానంలో మెరిడిత్‌, ప్రబ్‌సిమ్రాన్‌లకు అవకాశం కల్పించాం. మయాంక్‌ స్థానంలో ప్రబ్‌సిమ్రాన్‌ ఓపెనర్‌గా రానున్నాడు. ఇక గేల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు మాత్రం గేల్‌ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడు. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ దూకుడు కనబరుస్తుంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 90 పరుగులు చేసింది. గేల్‌ 45, రాహుల్‌ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top