ఫ్యాన్స్‌‌ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల

IPL 2020 : Entertainment In Stadium Without Cricket Fans Got Huge Response - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి బంతికే ఫోర్‌.. ఆ తర్వాత డి కాక్‌ భారీ షాట్లు, ఆపై వికెట్లు... ఇలా మ్యాచ్‌లో ఏం జరిగినా.... ప్రేక్షకుల చప్పట్లు, కేరింతలతో స్టేడియంలో హోరెత్తిపోతోంది!. అదేంటి ఈ ఐపీఎల్‌కు అభిమానులను మైదానంలోకి అనుమతించలేదు కదా అనుకుంటున్నారా... ఐపీఎల్‌ నిర్వాహకులు టీవీ ప్రేక్షకుల కోసం చేసిన మాయ ఇది. లీగ్‌ ఆరంభానికి ముందే రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని కలిగించేందుకు ఐపీఎల్‌ టీమ్‌ ప్రయత్నించింది. చాలా వరకు అందులో సఫలమైంది కూడా.. సరిగ్గా చెప్పాలంటే ఆటకు, అరుపులకు సింక్‌ బాగా కుదిరింది. (చదవండి : ఫీల్డింగ్‌‌లో మెరుపులు.. జరజాగ్రత్త!)

అయితే ఇలా చేయడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆకట్టుకుందని కొందరంటే... లీగ్‌ను సహజంగా చూపిస్తేనే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరు జట్లకు చెందిన కొందరు అభిమానుల స్పందనలను కూడా మ్యాచ్‌ సాగుతున్న సమయంలో లైవ్‌ కెమెరాల ద్వారా ప్రసారకర్తలు చూపించడం విశేషం. కరోనా నేపథ్యంలో మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో లీగ్‌ నిర్వాహకులు ఇలాంటి ప్రయత్నం చేపట్టడం కాస్త ఆసక్తికరంగా మారింది.(చదవండి : ముంబైపై విజయంతో ధోని కొత్త చరిత్ర)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top