
స్విట్జర్లాండ్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి నిధులు పొందుతూ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు విముఖత చూపితే... వారికి నిధులు నిలిపివేస్తామని ఇటీవల కేంద్ర క్రీడా శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్... డబుల్స్ స్పెషలిస్ట్ యూకీ బాంబ్రీ మళ్లీ ముందుకొచ్చారు. ఈ ఏడాది సెపె్టంబర్ 12 నుంచి 14 వరకు స్విట్జర్లాండ్‌తో బీల్ నగరంలో జరిగే డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.
సింగిల్స్‌లో సుమిత్ నగాల్, కరణ్ సింగ్, ఆర్యన్ షా... డబుల్స్‌లో యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ ఎంపికయ్యారు. హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ, శశికుమార్ ముకుంద్, దక్షిణేశ్వర్ సురేశ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 306వ స్థానంలో ఉన్న సుమిత్ నగాల్ చివరిసారి 2023లో డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ తర్వాత పాకిస్తాన్, స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్‌లకు సుమిత్ దూరంగా ఉన్నాడు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న యూకీ బాంబ్రీ గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో ఆడిన తర్వాత స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు.