Table Tennis: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి | Indian Table Tennis Player Manika Batra Reach Career Best Rank | Sakshi
Sakshi News home page

Manika Batra: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి

Jan 4 2023 9:55 AM | Updated on Jan 4 2023 10:17 AM

Indian Table Tennis Player Manika Batra Reach Career Best Rank - Sakshi

( ఫైల్‌ ఫోటో )

Manika Batra:  అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ మనిక బత్రా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది.

జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్‌ 136వ ర్యాంక్‌ లో ఉన్నాడు. సత్యన్‌ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.    

ఇది కూడా చదవండి: రామ్‌కుమార్‌కు మిశ్రమ ఫలితాలు 
పుణే: టాటా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్‌ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్‌ పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు.

అయితే డబుల్స్‌ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్‌–మిగెల్‌ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్‌ బోపన్న (భారత్‌)–జాండ్‌షుల్ప్‌ (నెదర్లాండ్స్‌) ద్వయంపై ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్‌ సాదియో దుంబియా–రిబూల్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో... పురవ్‌ రాజా–దివిజ్‌ శరణ్‌ (భారత్‌) ద్వయం 4–6, 3–6తో జీవన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జోడీ చేతిలో ఓడిపోయాయి.  

చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్‌! ఎందుకో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement