రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా ఓటమి.. | India vs England 3rd T20I Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG 3rd T20: రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా ఓటమి..

Jan 28 2025 6:34 PM | Updated on Jan 28 2025 10:43 PM

India vs England 3rd T20I Live Updates And Highlights

India vs England 3rd T20I Live Updates And Highlights: 

భారత్‌ ఓటమి.. 
రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 26 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జామీ ఓవర్టన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్‌ కార్స్‌, జోఫ్రా అర్చర్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

వీరిద్దరితో పాటు అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌ తలా వికెట్‌ సాధించారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(18) పర్వాలేదన్పించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

 భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్‌ స్టోన్‌(43), జోస్‌ బట్లర్‌(24) పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ ఆశలను 2-1 సజీవంగా ఉంచుకుంది.

ఆరో వికెట్‌ డౌన్‌.. అక్షర్‌ పటేల్‌ ఔట్‌
అక్షర్‌ పటేల్‌ రూపంలో భారత్ ఆరో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌.. అర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

17 ఓవర్లకు భారత్‌ స్కోర్‌:122/5
17 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి 18 బంతుల్లో 50 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్‌ పాండ్యా(33),అక్షర్‌ పటేల్‌(15) ఉన్నారు.

భారత్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సుందర్‌... జామీ ఓవర్టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12.1 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 85/4

తిలక్‌ వర్మ ఔట్‌..
తిలక్‌ వర్మ రూపంలో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన వర్మ.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 78/4

సూర్యకుమార్‌ ఔట్‌..
భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో హార్దిక్‌​ పాండ్యా వచ్చాడు. 6 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 51/3

అభిషేక్‌ ఔట్‌..
అభిషేక్‌ శర్మ రూపంలో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్‌.. బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్‌ వర్మ వచ్చాడు.

తొలి వికెట్‌ డౌన్‌..
టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్‌.. అర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.  అభిషేక్‌ శర్మ(16) దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌:  23/1

ఐదేసిన వరుణ్‌.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?
రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్‌ స్టోన్‌(43), జోస్‌ బట్లర్‌(24) పరుగులతో రాణించారు.

ఐదేసిన వరుణ్‌.. ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ డౌన్‌
వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసిన చక్రవర్తి.. నాలుగో బంతికి కార్సే, ఐదో బంతికి అర్చర్‌న  ఔట్‌ ‍చేశాడు.

వరుణ్‌ మ్యాజిక్‌.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లు
వరుణ్‌ చక్రవర్తి మరోసారి తన స్పిన్‌ మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేసిన చక్రవర్తి.. మూడో బంతికి స్మిత్‌, నాలుగో బంతికి ఓవర్టన్‌ వరుస క్రమంలో ఔట్‌ ‍చేశాడు.

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
హ్యారీ బ్రూక్‌ రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బ్రూక్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు. 13 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 108/4

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌..
దూకుడుగా ఆడుతున్న బెన్‌ డకెట్‌(51) వికెట్‌ భారత్‌ ఎట్టకేలకు సాధించింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డకెట్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. క్రీజులోకి లైమ్‌ లివింగ్‌స్టోన్‌ వచ్చాడు.

ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ డౌన్‌.. బట్లర్‌ ఔట్‌
జోస్‌ బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బట్లర్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్‌ వచ్చాడు. 9 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 83/2

8 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 74/1
ఇంగ్లండ్‌ ప్లేయర్లు బెన్‌ డకెట్‌(42), బట్లర్‌(23) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 74/1

దూకుడుగా ఆడుతున్న డకెట్‌​..
4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇంగ్లండ్ వికెట్ న‌ష్టానికి 34 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్(24) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు జోస్ బ‌ట్ల‌ర్‌(5) ఉన్నాడు.

తొలి వికెట్‌ డౌన్‌..
ఫిల్‌ సాల్ట్‌ రూపంలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సాల్ట్‌.. హార్దిక్‌​ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వచ్చాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్‌: 25/1

బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌..
రాజ్‌కోట్ వేదిక‌గా మూడో టీ20లో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్‌​ పేసర్‌ మహ్మద్‌ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

రాజ్‌కోట్‌ టీ20లో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ స్ధానంలో షమీ తుది జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్‌కు జట్టు మెనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. మ‌రోవైపు ఇంగ్లండ్ త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. చెపాక్‌లో ఆడిన జ‌ట్టునే ఇంగ్లండ్ కొన‌సాగించింది.

తుది జట్లు
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీప‌ర్‌), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత్: సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా బుమ్రా

Advertisement
 
Advertisement
Advertisement