T20 World Cup India Squad: టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే టీమిండియా ఇదే

India Squad Announced For T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి కిందే ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి రోహిత్ శర్మ నాయకుడిగా, కేఎల్ రాహుల్ ఉప నాయకుడిగా వ్యవహరించనున్నారు. ఆసియా కప్-2022లో పాల్గొన్న భారత జట్టునే సెలెక్టర్లు యధాతథంగా కొనసాగించారు. బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. 15 మంది సభ్యుల్లో ఉంటారనుకున్న మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌కు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది. వీరిని స్టాండ్ బై సభ్యులుగా ఎంపిక చేశారు సెలెక్టర్లు.
One title 🏆
One goal 🎯
Our squad 💪🏻#TeamIndia | #T20WorldCup pic.twitter.com/Dw9fWinHYQ— BCCI (@BCCI) September 12, 2022
టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్