సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్‌ | Sakshi
Sakshi News home page

సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్‌

Published Sun, Apr 28 2024 1:25 PM

India Secured One Of Its Biggest Wins In Archery As The Mens Recurve Team Stunned Reigning Olympic Champion South Korea

భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో డిఫెండింగ్‌ ఒలింపిక్‌ ఛాంపియన్‌ సౌత్‌ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 

 

 ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్‌ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.  

 

Advertisement
 
Advertisement
 
Advertisement