టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలి: పాక్‌ మాజీ క్రికెటర్‌

India need better bowlers for World Cup,says Danish Kaneria - Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా భారత్‌ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్‌ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో ఓటమిపాలైన రోహిత్‌ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ గెలవాలంటే మెరుగైన బౌలింగ్‌ యూనిట్‌ అవరమని కనేరియా  అభిప్రాయపడ్డాడు.

కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్‌ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్,టి నటరాజన్‌ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి.

ఇక భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్‌లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్‌ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్‌ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్‌కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంత్‌ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top