
India have big names but their fitness and form is not up to the mark: ‘‘ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సమతూకంగా ఉంది. యువ రక్తంతో నిండి ఉంది. టీమిండియాలో స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్ల ఫిట్‌నెస్, ఫామ్ ఆశించిన తీరుగా లేదు. అందుకే భారత జట్టు తడబడుతోంది. జట్టు కూర్పు కోసం ఫామ్‌లో ఉన్న కొత్త ఆటగాళ్లను వెదికిపట్టుకోవాలి. అయితే, పాక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
( ఫైల్ ఫోటో )
ఈసారి పాక్ ఓడించగలదు
ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ ప్రగల్బాలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. పటిష్ట టీమిండియాను బాబర్ ఆజం జట్టు ఓడించగలదంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 14న మ్యాచ్ జరుగనుంది.
టోర్నీకే హైలైట్ మ్యాచ్ ఆరోజే
మెగా టోర్నమెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలవనున్న ఈ మ్యాచ్ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అకీబ్ జావేద్ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా పాక్ పేస్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. నసీం షా కంటే జమాన్ ఖాన్ బెటర్ అని పేర్కొన్నాడు.
( ఫైల్ ఫోటో )
నసీం కంటే అతడే బెటర్
‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జమాన్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ డెత్ బౌలర్లలో తనూ ఒకడని చెప్పవచ్చు. నసీం షా కంటే అతడే బెటర్ అనిపిస్తోంది. షాహిన్, హారిస్, జమాన్.. పరిమిత ఓవర్లలో ఈ త్రయం ఉంటే పాకిస్తాన్ జట్టుకు మేలు చేకూరుతుంది’’ అని జావేద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా వన్డే కప్-2023 నేపథ్యంలో ప్రకటించిన పాక్ జట్టులో జమాన్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో నసీం షాకు బదులు లాహోర్ ఖలందర్స్ బౌలర్‌ను తీసుకోవాల్సిందని ఆ జట్టు కోచ్ అకీబ్ జావేద్ పేర్కొనడం గమనార్హం.
చదవండి: తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్‌కప్..