breaking news
aaqib javed
-
నన్ను ఎవరు తొలగిస్తారు?.. పాక్ చీఫ్ సెలక్టర్
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో పాక్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో బాబర్ ఆజం బృందం 3-0తో క్లీన్‌స్వీప్ అయింది.ఏం చేసినా ఫలితం శూన్యంఅయితే, మూడో టెస్టుకు ముందే పాక్ క్రికెట్ బోర్డు (PCB) జట్టుకు సంబంధించి గణనీయమైన మార్పులు చేసింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడంతో పాటు.. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తమ పదవుల నుంచి తొలగించింది.ఇన్ని మార్పుల తర్వాత కూడా పాక్ ఆట తీరులో మార్పు రాలేదు. ఇంగ్లండ్ చేతిలో మూడో టెస్టులోనూ ఓడి.. పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు తీరుపై.. ముఖ్యంగా చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.పాకిస్తాన్ మాజీ హెడ్‌కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిల్లెస్పి సైతం ఆకిబ్‌పై మండిపడ్డాడు. అతడు వచ్చిన తర్వాతే పాక్ క్రికెట్ నాశనం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పులను ఒప్పుకోకుండా... నెపాన్ని మాజీ కోచ్లమైన నాపై, గ్యారీ కిర్‌స్టెన్‌పై నెట్టేస్తున్నాడంటూ ఆరోపించాడు.వేటుకు రంగం సిద్ధంఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ సైతం ఆకిబ్ జావేద్‌పై గుర్రుగా ఉన్నాడని.. అతడిపై వేటు వేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. ప్రక్షాళనలో భాగంగా ఆకిబ్ తొలగింపు లాంఛనమేనని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ ఈ పరిణామాలపై తాజాగా స్పందించాడు.నన్ను ఎవరూ తొలగించడం లేదుపాక్ మీడియా డాన్ న్యూస్ ప్రకారం.. ‘నేను నా చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయడం లేదు. బోర్డులో నేను పోషిస్తున్న ఇతర బాధ్యతల నుంచి కూడా వైదొలగడం లేదు. మీరు విన్నవన్నీ అవాస్తవాలు, కల్పితాలు. నన్ను ఎవరూ తొలగించడం లేదు’’ అని ఆకిబ్ జావేద్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా 2024లో ఆకిబ్ జావేద్ పాక్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా వచ్చాడు. అతడి హయాంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ 101 మ్యాచ్‌లు ఆడి 53 గెలిచింది. తద్వారా విజయాల శాతం 52.47గా నమోదైంది. ఆకిబ్ రావడానికి ముందు రెండేళ్ల కాలంలో పాక్ జట్టు 78 మ్యాచ్‌లలో కేవలం 33 గెలిచింది. దీనిని బట్టి ఆకిబ్ వచ్చిన తర్వాతే పాక్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తుంది. కాబట్టి అతడిని మరికొంతకాలం కొనసాగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీపై సంజూ స్పందన -
అతడు పోతేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్‌లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్‌గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్‌గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు. పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్‌తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్‌గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను. కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్‌గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్‌పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది. కోచ్‌గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్‌ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years.""Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026చదవండి: కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం! -
నీకసలు సెన్స్ ఉందా? : ఆసీస్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్లో తలెత్తిన తాజా సంక్షోభంపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి ఘాటుగా స్పందించాడు. ప్యాంట్లు మార్చినంత తేలికగా.. ఎప్పుటికప్పుడు పాక్ జట్టు యాజమాన్యం తమ ప్రణాళికలు, ఆలోచనలు మార్చుకుంటుందని ఘాటు విమర్శలు చేశాడు.కోచ్, ఆటగాళ్లపై వేటుకాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో నిలకడ ఉండదన్న సంగతి తెలిసిందే. ఎప్పుటికప్పుడు అక్కడ కోచ్‌లు, కెప్టెన్లు మారిపోతూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. పాక్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు జట్టు హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది.అదే విధంగా.. దాదాపు ఏడు మంది ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2024లో పాక్ జట్టుకు ఎనిమిది నెలల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన గిల్లెస్పి స్పందించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వార్తా సంస్థతో మాట్లాడుతూ..వాళ్లను చూస్తే జాలేస్తోంది‘‘పాపం పాకిస్తాన్ ఆటగాళ్లను చూస్తే జాలేస్తోంది. వాళ్ల జీవనాధారం ఆట. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతోనే వాళ్లంతా ఆ జట్టులో ఉన్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. సల్మాన్ అలీ ఆఘా తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉన్నాడు. రెండో టెస్టు నుంచి అతడిని తొలగించారు.మూడో టెస్టుకు ముందు స్వదేశానికి పిలిపించారు. అసలు ఇదేం తీరు? దీనిని బట్టి సెలక్షన్ కమిటీ ఎంత గందరగోళంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకిబ్ జావేద్ వచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీ చెత్తగా మారిపోయింది. ప్యాంట్లు మార్చినంత తేలికగా వాళ్లు నిర్ణయాలు మార్చేసుకుంటారు.నీకసలు సెన్స్ ఉందా?ఆకిబ్ జావేద్ ఇటీవల నాపై, గ్యారీ కిర్‌స్టెన్‌పై నిందలు వేశాడు. మా వల్ల జట్టు వెనుకబడిందన్నాడు. మరి గత రెండేళ్లుగా అతడే సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. అప్పుడు కూడా జట్టు పరిస్థితి ఇదే విధంగా ఉండేది. కానీ అతడు మమ్మల్ని నిందిస్తున్నాడు.అసలు సెన్స్ ఉన్నవాళ్లు ఎవరూ ఆకిబ్లా మాట్లాడరు. ఆకిబ్ ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలి. తన తప్పుల్ని తెలుసుకోవాలి. అసలు ఆకిబ్ జావేద్‌కు ఇతర సెలక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయో లేదో? ఈ విషయాన్ని పక్కనపెడితే వారితో అసలు మాట్లాడుతూ వారి ఆలోచనలు కూడా తెలుసుకుంటున్నాడా? లేదా అన్నదే ప్రశ్న.ఆటగాళ్లు జట్టులో తాము స్థానం కోల్పోయిన విషయాన్ని మీడియా ద్వారానో.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారానో తెలుసుకోవడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదు. ఇది వారిని అగౌరవపరచడమే’’ అని జేసన్ గిల్లెస్పి పాక్ బోర్డు, చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ తీరుపై నిప్పులు చెరిగాడు. చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
‘అతడు మానసికంగా అన్‌ఫిట్.. అందుకే చోటు కరువు’
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్‌కోచ్ మైక్ హెసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో...ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్‌కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్‌కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్ఫిట్అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్‌కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్‌గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్‌ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్‌గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్‌కప్‌లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు -
బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పాక్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్. అతని బౌలింగ్ యాక్షన్ కూడా భిన్నంగానే ఉంటుంది. బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్ తారిఖ్ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్ దొరకడు’ అని పేర్కొన్నాడు. కాగా ఆకిబ్ జావేద్ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్ తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్ -
యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్ చేతిలో చిత్తు! పాక్ జట్టులో భారీ మార్పులు?
భారత్-పాకిస్తాన్(India vs Paksitan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఏ వేదిక పైన జరిగినా ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లు ఎప్పుడూ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల ఈ రెండు జట్లు మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ స్థాయిలో సన్నద్ధమైంది. "యోధుల్లాగా పోరాడండి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy) భారత జట్టును ఓడించి మీ సత్తా చూపించండి" అని ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆ దేశ క్రికెటర్లను తన సందేశంతో యుద్ధం స్థాయిలో సన్నద్ధం చేశారు. కానీ భారత్ క్రికెటర్ల ప్రతిభ ముందు ఇవేమి పనిచేయలేదు.ఘోర పరాజయంపాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిదూడడంతో ప్రస్తుతం గ్రూప్ స్టేజి లోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిధ్యమిచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు రోజుల్లోనే అవమానకరమైన రీతిలో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ప్రకృతి కూడా సహకరించలేదుమొదట న్యూజిలాండ్, ఆ తర్వాత భారత్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్ కి ప్రకృతి కూడా సహకరించలేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలని ఆశించిన పాకిస్తాన్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల నుంచి కేవలం ఒక్క పాయింట్ తో అవమానకరంగా వైదొలిగింది.స్వదేశం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో పాకిస్తాన్ క్రికేటర్ల పేలవమైన ప్రదర్శన పై ఆ దేశం మొత్తం అసంతృప్తి గా ఉంది. అభిమానులు, క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల నుండి చాలా మంది పాకిస్తాన్ ప్రదర్శన పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ని షెహబాజ్ షరీఫ్ స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారు.షెహబాజ్ షరీఫ్ రాజకీయ మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు దారుణమైన ప్రదర్శనను ప్రధాని స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ క్రికెట్ సంబంధిత అంశాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ఆయన సూచించారు.పీసీబీ అధికారులపై అసంతృప్తిప్రధాన మంత్రి సహాయకుడు రాణా సనావుల్లా, దేశంలోని ప్రొఫెషనల్ క్రికెట్‌పై ఆర్థిక వ్యయాలకు సంబంధించి పారదర్శకత కోసం పిలుపునిచ్చారు. క్రీడలకు వనరులు ఎలా కేటాయించబడుతున్నాయ్యో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. జవాబుదారీతనం మరియు సంస్కరణల అవసరాన్ని గురుంచి మరింత నొక్కి చెప్పారు.పాకిస్తాన్‌కు చెందిన 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని ఉన్నత స్థాయి అధికారుల అధిక జీతాలపై దృష్టిని సారించాలని రాణా సనావుల్లా సూచించారు. దాదాపు నెలకు రూ.5 మిలియన్ల వరకు జీతం పొందుతున్న పీసీబీ అధికారులలో చాలా మందికి వారి బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన లేదని, అయినప్పటికీ వారు తమ విధులను నిర్వర్తించకుండా గణనీయమైన పరిహారం పొందుతూనే ఉన్నారని సనావుల్లా విమర్శించారు.అంతేకాకుండా, పీసీబీ అధికారులు అనుభవిస్తున్న విపరీత ప్రోత్సాహకాలు మరియు అధికారాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వారు పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తున్నారా లేదా అభివృద్ధి చెందిన దేశంలో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పిసిబి లో చాలా కాలంగా కొనసాగుతున్న అధికార దుర్వినియోగానికి సనావుల్లా ఈ సమస్యలను ఆపాదించారు. పీసీబీ అధికారుల జవాబురాహిత్యం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ క్షీణతకు ప్రత్యక్షంగా దోహదపడిందని ఆయన వాదించారు.పాక్ జట్టులో భారీ మార్పులు ? ఈ సమీక్ష పాకిస్తాన్ జట్టులో భారీ కుదుపులకు దారితీయవచ్చు, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు నసీమ్ షా వంటి ప్రముఖ ఆటగాళ్ళు బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. జట్టు వైఫల్యం కారణంగా తాను రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ, పీసీబీ అతని ఒప్పందాన్ని రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, ఈ ఏడాది లో జరిగే ఆసియా కప్ సమయంలో రెండు చిరకాల ప్రత్యర్థులు కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్ , శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ జట్లు సిద్ధమవుతున్నందున ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆసియా కప్‌ను నిర్వహించే హక్కులు భారత్ కి కేటాయించినప్పటికీ ఈ టోర్నమెంట్ తటస్థ దేశంలో జరుగుతుందని భావిస్తున్నారు. భారత్- పాకిస్తాన్ ఆతిథ్య దేశాలుగా ఉన్నప్పుడు, పోటీని వేరే చోట నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) గతంలో ప్రకటించింది.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
నేను అలాంటి వాడిని కాదు.. కఠిన చర్యలు ఉంటాయి: పాక్ హెడ్‌కోచ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో వరుస పరాజయాలతో.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇంటా బయటా రిజ్వాన్(Mohammad RIzwan) బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ ఆకిబ్ జావేద్(Aaqib Javed) సైతం ఆటగాళ్లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడని.. ఘాటు వ్యాఖ్యలతో వారిని దూషించాడని స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఆటగాళ్లను గౌరవిస్తానుఈ వార్తలపై ఆకిబ్ జావేద్ తాజాగా స్పందించాడు. తానెన్నడూ ఆటగాళ్లను దూషించలేదని స్పష్టం చేశాడు. తమ జట్టులో కోచ్ ఆటగాళ్లను తిట్టే సంస్కృతి ఉందన్న మాట నిజమేనని.. అయితే, తాను మాత్రం అందుకు విరుద్ధమని తెలిపాడు. ఈ మేరకు.. ‘‘ఆటగాళ్లపై నేనెప్పుడూ అసభ్య పదజాలం వాడను.గురువు పిల్లలను కొట్టడం, కోచ్ ఆటగాళ్లను తిట్టడం మా సంస్కృతిలో ఉంది. అయితే, నేను మాత్రం ఈ విధానాన్ని విశ్వసించను. ఆటగాళ్లను నేను గౌరవిస్తాను. కోచ్‌గా వారికి కావాల్సిన సాయం చేస్తాను. జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా శ్రమించేలా చేస్తాను. అంతేగానీ.. తిట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆలోచించే రకం కాదు’’ అని ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.అందుకే నిలకడ కూడా ఉండదుఇక చాంపియన్స్ ట్రోఫీలో పాక్ బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘గత నాలుగేళ్లుగా మా క్రికెట్ బోర్డులో, జట్టులో చాలా మార్పులే జరిగాయి. సరైన, నిర్ధిష్టమైన విధానాలు లేనప్పుడు నిలకడ కూడా ఉండదు.మా ఆటగాళ్లను వేరే జట్ల ఆటగాళ్లతో పోల్చినపుడు వారి బోర్డులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి? అన్న అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యాజమాన్యం నిలకడగా ఉంటే.. ఆటగాళ్లను కూడా మనం ప్రశ్నించే వీలు ఉంటుంది’’ అని పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఆకిబ్ జావేద్ పరోక్షంగా విమర్శలు సంధించాడు.ఏదేమైనా ఐసీసీ టోర్నమెంట్లలో వరుస ఓటములు చవిచూసిన జట్టును ఉపేక్షించేది లేదని.. కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సాకులు చెప్పి తప్పించుకునే వీలులేదు. కచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు ముందు ఫలితం అనుకూలంగా ఉంటుందనే భావిస్తాం.కచ్చితంగా బాధ ఉంటుందికానీ ఒక్కోసారి చెత్త ప్రదర్శన కారణంగా తీవ్ర నిరాశకు గురికావాల్సి వస్తుంది. కచ్చితంగా ఈ ఓటములు మమ్మల్ని బాధించాయి. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడతామని జాతికి చెప్పడం తప్ప ప్రస్తుతం చేసేదేమీ లేదు’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా లీగ్ దశలో భాగంగా చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్ న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓడి సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లోనూ ఇదే తరహా చెత్త ప్రదర్శనతో నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా చీఫ్ సెలెక్టర్
పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ ఆకిబ్ జావిద్ ఎంపికయ్యాడు. జావిద్ ఎంపిక టెంపరరీ బేసిస్ (తాత్కాలికం) మీద జరిగింది. జావిద్ వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పదవిలో కొనసాగుతాడు. జావిద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.కాగా, కొద్ది రోజుల కిందట గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ పదవికి అర్దంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెడ్‌బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పీ పాక్ వైట్‌బాల్ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో (2-1) ఓడించింది. అయితే పాక్ టీ20 సిరీస్‌ను మాత్రం 0-3 తేడాతో కోల్పోయింది.గిల్లెస్పీకి ముందు పెర్మనెంట్ వైట్‌బాల్ కోచ్‌గా ఎంపికైన గ్యారీ కిర్‌స్టన్ బోర్డుతో విభేదాల కారణంగా ఒక్క వన్డేలో కూడా కోచ్‌గా పని చేయకుండా వైదొలిగాడు. పాక్ గత ఏడాది కాలంలో ఐదుగురు వైట్‌బాల్ కోచ్‌లను మార్చింది. పాక్ పెర్మనెంట్ వైట్‌బాల్ హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోగా ముగుస్తుందని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అనంతరం పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సిరీస్లన్నిటికీ పాక్ హెడ్‌కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించనున్నాడు.కాగా, పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రిత్యా భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని తేల్చిచెప్పింది. దీంతో టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ నుంచి ఇతర దేశానికి మార్చాలని ఐసీసీ చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని తటస్ఠ వేదికపై నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు పాక్ నో చెప్పడంతో ఐసీసీ పునరాలోచనలో పడింది. -
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం..
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో కూడా జావేద్ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు. -
వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు అంత సీన్ లేదు..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్-పాక్‌ల మధ్య జరుగబోయే హైఓల్టేజీ మ్యాచ్‌పై పాక్ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ (1992) జట్టులోకి సభ్యుడు ఆకిబ్ జావిద్ అవాక్కులు చవాక్కులు పేలాడు. అహ్మదాబాద్ వేదకగా అక్టోబర్ 14న జరిగే ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టే ఫేవరెట్ అని గొప్పలు పోయాడు. ఇంతటితో ఆగకుండా టీమిండియాను కించపరిచే విధంగా పలు అతి వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సారధ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఫిట్నెస్, ఫామ్ రెండూ అంతంతమాత్రమేనని చెత్త వాగుడు వాగాడు. ప్రస్తుత జట్టుతో టీమిండియా తమపై గెలవలేదని ప్రగల్భాలు పలికాడు. భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా, సమతూకంగా ఉందని.. టీమిండియాలోని ఆటగాళ్లు పేరుకే పెద్ద ఆటగాళ్లని.. పాక్‌తో మ్యాచ్‌లో సో కాల్డ్ బిగ్ ప్లేయర్స్ అంతా తడబడటం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే వారికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం బెటర్ అని సూచించాడు. క్రిక్విక్ అనే వెబ్పైట్తో మాట్లాడుతూ ఆకిబ్ జావిద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ ఆటగాళ్లు, మాజీలు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి అన్నది కాదనలేని సత్యం. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌లు ఏడు సార్లు ఎదురెదురుపడగా అన్ని సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. ఇదిలా ఉంటే, తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉండింది. అయితే మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను ఒక రోజు ముందు ప్రీ పోన్ చేశారు. ఈ మ్యాచ్‌తో పాటు ఐసీసీ మరో ఎనిమిది మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. పలు రకాల కారణాల చేత ఐసీసీ తప్పనిసరి పరిస్థితుల్లో షెడ్యూల్‌ను మార్చింది. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కంటే ముందే భారత్-పాక్‌లు ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్ 2న తలపడనున్న విషయం తెలిసిందే. -
టీమిండియాలో స్టార్లు ఉన్నా గానీ.. మాదే పైచేయి: పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
India have big names but their fitness and form is not up to the mark: ‘‘ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సమతూకంగా ఉంది. యువ రక్తంతో నిండి ఉంది. టీమిండియాలో స్టార్లు ఉన్నారు.. కానీ వాళ్ల ఫిట్నెస్, ఫామ్ ఆశించిన తీరుగా లేదు. అందుకే భారత జట్టు తడబడుతోంది. జట్టు కూర్పు కోసం ఫామ్‌లో ఉన్న కొత్త ఆటగాళ్లను వెదికిపట్టుకోవాలి. అయితే, పాక్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ( ఫైల్ ఫోటో ) ఈసారి పాక్ ఓడించగలదు ఈసారి భారత గడ్డపై టీమిండియాను పాకిస్తాన్ ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్ ప్రగల్బాలు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా.. పటిష్ట టీమిండియాను బాబర్ ఆజం జట్టు ఓడించగలదంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 14న మ్యాచ్ జరుగనుంది. టోర్నీకే హైలైట్ మ్యాచ్ ఆరోజే మెగా టోర్నమెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలవనున్న ఈ మ్యాచ్ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అకీబ్ జావేద్ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా పాక్ పేస్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. నసీం షా కంటే జమాన్ ఖాన్ బెటర్ అని పేర్కొన్నాడు. ( ఫైల్ ఫోటో ) నసీం కంటే అతడే బెటర్ ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో జమాన్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ డెత్ బౌలర్లలో తనూ ఒకడని చెప్పవచ్చు. నసీం షా కంటే అతడే బెటర్ అనిపిస్తోంది. షాహిన్, హారిస్, జమాన్.. పరిమిత ఓవర్లలో ఈ త్రయం ఉంటే పాకిస్తాన్ జట్టుకు మేలు చేకూరుతుంది’’ అని జావేద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా వన్డే కప్-2023 నేపథ్యంలో ప్రకటించిన పాక్ జట్టులో జమాన్ ఖాన్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో నసీం షాకు బదులు లాహోర్ ఖలందర్స్ బౌలర్‌ను తీసుకోవాల్సిందని ఆ జట్టు కోచ్ అకీబ్ జావేద్ పేర్కొనడం గమనార్హం. చదవండి: తిరిగింది చాలు.. ఇక ఆటపై దృష్టి పెట్టు! అసలే వరల్డ్‌కప్.. -
WC 2023: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! టీమిండియా బ్యాటర్లు..
ICC ODI World Cup 2023- India Vs Pakistan: టీమిండియా బ్యాటర్లపై పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అక్కసు వెళ్లగక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లు పాక్ బౌలర్లలా బౌలింగ్ చేయలేరని.. అందుకే భారత జట్టు వందల కొద్ది పరుగులు రాబట్టిందని పేర్కొన్నాడు. ఒకవేళ పాక్‌తో తలపడి ఉంటే భారీ స్కోర్లు నమోదయ్యేవి కావంటూ టీమిండియా ఆట తీరును తక్కువ చేసేలా మాట్లాడాడు. అదరగొట్టిన టీమిండియా.. అదే హైలైట్ కాగా మూడు వన్డే, మూడు టీ20 సిరీస్‌లు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 18న హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ(208) హైలైట్‌గా నిలిచింది. అదే విధగా రాయ్‌పూర్‌లో జనవరి 21న జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్‌ను 108 పరుగులకే కట్టడి చేసి 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. క్లీన్‌స్వీప్‌తో సత్తా చాటి ఇక నామమాత్రపు ఇండోర్ వన్డేలో జనవరి 24 నాటి మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుబ్‌మన్ గిల్ (112) సెంచరీలతో చెలరేగడంతో ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. కివీస్ 295 పరుగులకే చేతులెత్తేయడంతో 90 రన్స్ తేడాతో గెలిచింది. తద్వారా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంది. పాక్ గట్టి పోటీనిస్తుంది ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ టీమిండియా- న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను ఉద్దేశించి జియో న్యూస్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టీమిండియా పాకిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ గట్టిపోటీనిస్తుంది. మా ప్రధాన బలం అదే.. కివీస్‌లా కాదు వరల్డ్‌కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లినా సరే.. అక్కడి పిచ్‌లు పాక్ ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు 400 మేర స్కోరు చేశారు. అయితే, పాకిస్తాన్ బౌలింగ్.. న్యూజిలాండ్ బౌలింగ్‌లా ఉండదు. నిజానికి వన్డేల్లో పాకిస్తాన్ క్రికెట్‌కు బౌలింగే ప్రధాన బలం. షాహిన్ ఆఫ్రిది, హారీస్ రవూఫ్, నసీం షా పూర్తి ఫిట్‌గా ఉన్నారు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కూడా కీలకసమయంలో రాణించగలరు. కాబట్టి ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లలో పాకిస్తాన్ గనుక 300 స్కోరు చేసిందంటే దానిని ఛేధించడం ఏ జట్టుకైనా కష్టమే’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా 1992 ప్రపంచకప్ గెలిచిన జట్టులో జావేద్ సభ్యుడన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో?! ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఆసియా కప్ వేదిక పాకిస్తాన్ కాగా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లదంటూ ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించాడు. దీంతో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ జట్టును భారత్‌కు పంపమంటూ పీసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు బోర్డులు తీసుకునే నిర్ణయంపైనే భారత్- పాక్ మ్యాచ్‌ల నిర్వహణ ఆధారపడి ఉంది. చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి! IND vs AUS: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! ఇక కష్టమే -
టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది ఆడకూడదు: పాక్ మాజీ ఆటగాడు
ఆసియాకప్-2022కు గాయం కారణంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ఆఫ్రిది.. ఇటీవల లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమైన ఆఫ్రిది.. టీ20 ప్రపంచకప్-2022కు మాత్రం ఎంపికయ్యాడు. కాగా ఆఫ్రిది గాయం నుంచి పూర్తిగా కోలుకోలేనప్పటికీ అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడాన్ని పాకిస్తాన్ మాజీ బౌలర్ ఆకిబ్ జావేద్ తప్పుబట్టాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండమని ఆఫ్రిదిని జావేద్ సూచించాడు. ఈ మెరకు క్రికెట్ పాకిస్తాన్‌తో జావేద్ మాట్లాడూతూ.. "షాహీన్ అఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా ఉంటారు. ఈ సమయంలో అఫ్రిదికి నేను ఒకే ఒక సలహా ఇవ్వగలను. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ కంటే అఫ్రిది ఫిట్నెస్ ముఖ్యం" అని పేర్కొన్నాడు. చదవండి: టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం.. -
T20 WC 2022: ‘బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవదు’
Asia Cup 2022- Pakistan- T20 World Cup 2022: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాకిస్తాన్ ఏ టోర్నీ కూడా గెలవలేదంటూ ఆ జట్టు మాజీ పేసర్ అకిబ్ జావేద్ అన్నాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లుగా పేరొందినా జట్టుకు మాత్రం ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం లేదంటూ విమర్శించాడు. ఈ ఓపెనర్లతో పాకిస్తాన్ ఐసీసీ టోర్నీలు గెలిచే అవకాశం లేదంటూ వ్యాఖ్యానించాడు. విఫలమైన బాబర్ ఆజం! ఆసియా కప్-2022 టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో ఈ ‘స్టార్ ఓపెనర్’ చేసిన మొత్తం పరుగులు 68. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు. అదరగొట్టిన రిజ్వాన్.. అయినా! ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం 281 పరుగులతో రాణించాడు. ఆసియా కప్-2022 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కీలక మ్యాచ్‌లలో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తన ఇన్నింగ్స్‌తో విజయాలు అందించాడు. అయితే, ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఎప్పుడు ఎలా ఆడాలో తెలియదు! దూకుడేది? ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అకిబ్ జావేద్.. బాబర్ ఆజం, రిజ్వాన్ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఇద్దరు ఓపెనర్లు మేజర్ టోర్నీల్లో గెలిపించలేరు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ప్రపంచంలో నంబర్ 1,2 ఆటగాళ్లుగా పేరొందారు. అలాంటి బ్యాటర్లకు ఎప్పుడు ఎలా ఆడాలో తెలియాలి కదా! వైస్ కెప్టెన్ రిజ్వాన్ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో.. 15 ఓవర్ల పాటు ఆడాడు. అవసరమైన రన్‌రేటు 8 ఉన్నప్పటి నుంచి అది 17కు పెరిగేంత వరకు ఉన్నాడు. ఇలాంటి ఆట తీరుతో వీళ్లేం గెలుస్తారు’’ అని జావేద్ పెదవి విరిచాడు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు! అదే విధంగా ఫఖర్ జమాన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై స్పందిస్తూ.. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు. నిజానికి బాబర్ లేదంటే రిజ్వాన్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తేనే జట్టుకు ఉపయోగం ఉంటుంది. ఓపెనర్‌గా తను రాణించగలడు’’ అని అకిబ్ జావేద్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియాకప్-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అకిబ్ జావేద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ఎందుకంటే! 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్!


