IND VS WI 3rd ODI: మూడో వన్డేకు పొంచి ఉన్న వాన గండం..!

IND VS WI 3rd ODI Rain Likely To Play Spoilsport In Trinidad - Sakshi

విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్‌ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్‌కు వేదిక అయిన పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్‌ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

దీంతో మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్‌ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి కాన్ఫిడెంట్‌గా ఉన్న ధవన్‌ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విండీస్‌ను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్‌ సైతం ఈ మ్యాచ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్‌లో రిజర్వ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్‌ రెండో వన్డేలో కొనసాగించిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్‌ హొసెన్‌పై వేటు​ వేసే ఆస్కారం ఉంది.  
చదవండి: Ind Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top