IND VS SL 1st ODI: నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌.. ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డు నమోదు

IND VS SL 1st ODI: Umran Malik Bowls 156 kmph Speed Ball - Sakshi

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్‌, కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు.

టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్‌.. ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్‌.. ఐపీఎల్‌లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్‌ తరఫున ఐపీఎల్‌లో ఉమ్రాన్‌దే రికార్డు. 

కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్‌), రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158  పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top