India Vs New Zealand: Kyle Jamieson Clean Bowled Kyle JamiesonTry To Play Defence - Sakshi
Sakshi News home page

IND vs NZ: డిఫెన్స్‌ ఆడాలనుకున్నాడు.. అవకాశమే ఇవ్వలేదు

Nov 27 2021 8:10 PM | Updated on Nov 28 2021 10:33 AM

IND vs NZ: Kyle Jamieson Clean Bowled Shubman Gill Try To Play Defence - Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కైల్‌ జేమీసన్‌ వేసిన అద్భుత డెలివరీకి గిల్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియాకు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే జేమీసన్‌ షాక్‌ ఇచ్చాడు.

చదవండి: Kyle Jamieson: 1865 బంతులు.. కైల్‌ జేమీసన్‌ అరుదైన ఘనత

జేమిసన్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతి ఔట్‌సైడ్‌ దిశగా వెళ్లడంతో గిల్‌ ఢిపెన్స్‌ చేద్దామనుకున్నాడు. కానీ ఆ అవకాశం లేకుండానే అనూహ్యంగా బంతి టర్న్‌ అయి గిల్‌ బ్యాట్‌, ప్యాడ్ల మధ్య గ్యాప్‌ నుంచి వెళ్లి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఈ దెబ్బకు గిల్ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.  

https://www.bcci.tv/videos/157270/ind-vs-nz-2021-1st-test-day-3-shubman-gill-wicket

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement