పేర్లలో కన్ఫ్యూజన్‌.. ఈసారి జడేజాదే పైచేయి

IND vs NZ: Jadeja Clean Bowled Rachin Ravindra Wins Battle Of Ravindras - Sakshi

Ravindra Jadeja Vs Rachin Ravindra.. రచిన్‌ రవీంద్ర.. రవీంద్ర జడేజా.. ఇద్దరి పేర్లలో రవీంద్ర కామన్‌గా కనిపిస్తుంది. ఒకరు టీమిండియాకు ఆడితే.. మరొకరు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరినొకరు పెద్దగా పరిచయం లేనప్పటికి.. అభిమానులు మాత్రం ఈ ఇద్దరిని రైవల్స్‌(ప్రత్యర్థులు)గానే చూస్తున్నారు. వీరిద్దరి పోటీలో ఈసారి జడేజా పైచేయి సాధించాడు. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో రచిన్‌ రవీంద్ర.. జడేజా వికెట్‌ తీయలేకపోయాడు.

చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్‌ పటేల్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో మూడో బౌలర్‌గా

కానీ జడేజా మాత్రం రచిన్‌ వికెట్‌ తీశాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌ 23 బంతుల్లో 13 పరుగులు చేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 111వ ఓవర్‌ నాలుగో బంతికి రచిన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. జడేజా వేసిన బంతి లెగ్‌స్టంప్‌ దిశగా వెళ్లి అనూహ్య టర్న్‌ తీసుకొని రచిన్‌ ప్యాడ్ల వెనుక నుంచి వికెట్లను గిరాటేసింది. దీంతో రచిన్‌ షాక్‌తో జడేజాను చూస్తూ పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి:  సూపర్‌ భరత్‌... సాహా స్థానంలో వచ్చీరాగానే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top