ఆ సిక్స్‌ దెబ్బకు.. బ్యాట్‌నే చెక్‌ చేశాడు!

Ind vs Eng: Ben Stokes Checks Out Shardul Thakurs Bat - Sakshi

పుణే:  ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ(37), ధవన్‌(67), పంత్‌(78), హార్దిక్‌ పాండ్యా(64)ల ఆట ఒక ఎత్తైతే, శార్దూల్‌ ఠాకూర్‌ ఇన్నింగ్స్‌ మరొక ఎత్తు. టీమిండియా కీలక వికెట్లు కోల్పోయి మూడొందల పరుగుల మార్కును దాటుతుందా అనుకునే సమయంలో  శార్దూల్‌ ఒక సొగసైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అది కూడా బంతులు వృథా చేయకుండా బ్యాట్‌కు పని చెప్పాడు. 21 బంతులు ఆడిన శార్దూల్‌ 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 30 పరుగులు సాధించాడు.  ఫలితంగా టీమిండియా 330 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఇంకా పది బంతులు మిగిలి ఉండగా టీమిండియా ఆలౌట్‌ కావడంతో 329 పరుగులకే పరిమితమయ్యారు. వికెట్లు పడకుంటా ఉంటే మరికొన్ని విలువైన పరుగులు భారత్‌ ఖాతాలో చేరేవి.

శార్దూల్‌ బ్యాట్‌ను చెక్‌ చేసిన స్టోక్స్‌

ఈ మ్యాచ్‌లో భారత్‌ 11 సిక్స్‌లు కొట్టగా అందులో  పంత్‌, హార్దిక్‌లు తలో నాలుగు సిక్స్‌లు కొట్టారు. మిగతా మూడు శార్దూల్‌ బ్యాట్‌ నుంచి వచ్చినవే.  కాగా, శార్దూల్‌ కొట్టిన ఒక సిక్స్‌ మాత్రం  హైలైట్‌గా చెప్పవచ్చు. స్టోక్స​ వేసిన 45 ఓవర్‌ నాల్గో బంతికి శార్దూల్‌ సిక్స్‌ సాధించాడు. అవుట్‌ సైడ్‌ అఫ్‌ స్టంప్‌ వేసిన బంతిని శార్దూల్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చీ మరీ సిక్స్‌ కొట్టడం అభిమానుల్ని అలరించింది. లాంగ్‌ ఆఫ్‌ మీదుగా సిక్స్‌ కొట్టి శభాష్‌ అనిపించాడు శార్దూల్‌. దీనికి స్టోక్స్‌ సైతం ఆశ్చర్యపోయాడు. తాను బంతిని ఎలా వేస్తే ఏ రకంగా సిక్స్‌ కొట్టాడో అని స్టోక్స్‌ తలపట్టుకున్నాడు. అదే సమయంలో నాన్‌స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన శార్దూల్‌ ఆపి మరీ బ్యాట్‌ చెక్‌ చేశాడు.  ఆ క్రాకింగ్‌ సిక్స్‌ ఎలా సాధ్యమైందని నవ్వుతూ ప్రశ్నించిన స్టోక్స్‌.. బ్యాట్‌ను పట్టుకుని చెక్‌ చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top