
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తొలి సారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా హార్ధిక్ పాండ్యా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ రూ. 15 కోట్లకు పాండ్యాను కొనుగోలు చేసింది. పాండ్యాపై గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ప్రశంసల వర్షం కురిపించాడు. విజయవంతమైన కెప్టెన్‌గా ఎదగడానికి అవసరమైన అన్ని లక్షణాలు పాండ్యాలో ఉన్నాయని సోలంకి అభిప్రాయపడ్డాడు.
ఎంస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం పాండ్యాకు కలిసిస్తోందని అతడు తెలిపాడు. "హార్దిక్‌లో అతడిని విజయవంతమైన, అత్యుత్తమ కెప్టెన్‌గా మార్చగల లక్షణాలు మాకు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఐపీఎల్ టైటిల్‌ను గెలవడానికి అతని ట్రాక్ రికార్డ్ గురించి మేము చాలా సార్లు మాట్లాడుకున్నాము. అతడు మా లీడర్ షిప్ గ్రూప్‌లో భాగమయ్యాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంస్ ధోని వంటి కెప్టెన్‌ల నుంచి అతడు చాలా నేర్చుకున్నాడు. ఆ ఆనుభవం అతడు కెప్టెన్‌గా ఎదగడంలో సహాయపడుతోంది" అని సోలంకి పేర్కొన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. ఐపీఎల్-2022 మార్చి 26న వాంఖడే వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.
చదవండి: Shane Warne: చనిపోవడానికి 8 గంటల ముందు గిల్‌క్రిస్ట్‌కు మెసేజ్ చేసిన వార్న్.. ఏం చెప్పాడంటే