IND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్‌! ఇదేమి బుద్దిరా బాబు..

Hardik Pandya caught abusing substitute player for delay in bringing water - Sakshi

కోల్‌కతా వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తన సహానాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ సందర్భంగా వాటర్‌ బాటిల్‌ అందించడం ఆలస్యం కావడంతో హార్ధిక్‌.. సహచర సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ ఒకరిపై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. హార్దిక్‌ ఆడిన మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి.

ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ ఆఖరిలో చోటు చేసుకుంది. ఇక హార్దిక్‌ వాయిస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో హార్దిక్‌ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కేవలం వాటర్‌ కోసం సహచర ఆటగాడిని అలా దుర్భాషలాడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడుతున్నారు.

ఇక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు, అక్షర్‌ ఒక్క వికెట్‌ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్‌ మెండిస్‌(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు.
చదవండిVirat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌.. వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top