IND vs SL: కెప్టెన్‌గా తొలి ఓటమి.. హార్దిక్‌ పాండ్యాపై గంభీర్‌ కీలక వాఖ్యలు

Gautam Gambhir comments on Hardik Pandyas captaincy - Sakshi

పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాకు ఇదే తొలి ఓటమి కూడా. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కీలక వాఖ్యలు చేశాడు. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడని గంభీర్‌ కొనియాడాడు. 

స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ మాట్లాడుతూ.. "హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నాయి. అయితే ప్రతీ మ్యాచ్‌ తర్వాత అతడి కెప్టెన్సీ గురించి మనం చర్చించకూడదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైనంతమాత్రాన హార్దిక్‌ ఏదో తప్పు చేశాడని భావించడం సరికాదు.

అతడు నో-బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేడు కదా. అది బౌలర్‌ బాధ్యత. ఇప్పటివరకు అతడు సారథిగా వ్యవహరించినా ప్రతీ మ్యాచ్‌లోనే తన కెప్టన్సీ మార్క్‌ను చూపించాడు. అతడు ఫీల్డ్‌లో చాలా కూల్‌గా ఉంటాడు. హార్దిక్‌ తన సహాచర ఆటగాళ్లకు మద్దతుగా కూడా ఉంటాడు" అని పేర్కొన్నాడు. ఇక సిరీస్‌ డిసైడ్‌ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి.
చదవండి: IND Vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్‌, గిల్‌కు నో ఛాన్స్‌! పేసర్‌ ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top