IPL GT Mentor Gary Kirsten: గుజరాత్‌ టైటాన్స్‌ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే

Gary Kirsten Was Main Reason Behind Gujarat Titans IPL 2022 Title Win - Sakshi

క్రికెట్‌లో ఒక జట్టు మేజర్‌ కప్‌ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్‌కే. ఎందుకంటే కెప్టెన్‌ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్‌గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించి చాంపియన్‌గా నిలపడం అతని లక్ష్యం. కానీ కెప్టెన్‌ పేరు ప్రత్యక్షంగా కనిపిస్తే.. తెరవెనుక కనిపించని హీరో మరొకరు ఉంటారు.

అతనే టీమ్‌ కోచ్‌. జట్టులో ఎవరు సరిగా ఆడుతున్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారు.. బాధ్యతగా ఎవరు ఆడుతున్నారు.. ఒక ఆటగాడి వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది కోచ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ప్రత్యక్షంగా కెప్టెన్‌కు ఎంత పేరు వస్తుందో.. కోచ్‌కు కూడా అంతే ఉంటుంది. అయితే అది తెర వెనుక మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 

తాజాగా ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా అన్నీ తానై నడిపించిన హార్దిక్‌ పాండ్యాను మెచ్చుకోవడానికి ముందు మరొక అజ్ఞాతవ్యక్తిని తప్పక పొగడాల్సిందే. గుజరాత్‌ టైటాన్స్‌ మెంటార్స్‌గా టీమిండియా మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆశిష్‌ నెహ్రా గురించి పక్కనబెడితే కిర్‌స్టెన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.


PC: IPL Twitter
ఎప్పుడైతే గ్యారీ కిర్‌స్టెన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు మెంటార్‌గా వచ్చాడో.. ఆ జట్టు అప్పుడే సగం విజయం సాధించినట్లయింది. ఎందుకంటే కిర్‌స్టెన్‌ ఎంత గొప్ప కోచ్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ టీమిండియా గెలవడంలో కోచ్‌ కిర్‌స్టెన్‌ పాత్ర కీలకం. నాయకుడిగా ధోని జట్టును ముందుండి నడిపిస్తే.. తెరవెనుక కోచ్‌ పాత్రలో కిర్‌స్టెన్‌ విలువైన సలహాలు ఇచ్చి టీమిండియాను 28 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిపాడు. అలాంటి వ్యక్తి.. గుజరాత్‌ టైటాన్స్‌కు మెంటార్‌గా రావడం.. అతని సలహాలు కెప్టెన్‌ పాండ్యా తప్పకుండా పాటించడం జట్టుకు మేలు చేశాయి.


PC: IPL Twitter
ఐపీఎల్‌ 2022లో ''మ్యాచ్‌ కిల్లర్‌''గా మారిన​డేవిడ్‌ మిల్లర్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికి హార్దిక్‌ అతన్ని జట్టులో కొనసాగించడంపై మాస్టర్‌ ప్లాన్‌ కిర్‌స్టెన్‌దే. కట్‌చేస్తే మిల్లర్‌ ఫైనల్లోనూ చెలరేగి గుజరాత్‌ టైటాన్స్‌కు కప్‌ అందించాడు. అంతేకాదు లీగ్‌ ఆరంభానికి ముందు పాండ్యాపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతకముందు జరిగిన టి20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో గుజరాత్‌కు కెప్టెన్‌గా రావడం.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కిర్‌స్టెన్‌ పాండ్యాను ప్రోత్సహించడం జరిగిపోయాయి. మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ చేతల్లోనే పనిని చూపించే వ్యక్తి కిర్‌స్టెన్‌.. ఒక రకంగా గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించడంలో తన పాత్ర కూడా ఉంటుంది.

చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'

Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-05-2022
May 30, 2022, 19:08 IST
ఐపీఎల్‌లో టీమిండియా మాజీ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌ కోచ్‌ ఆశిష్ నెహ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ టైటిల్‌...
30-05-2022
May 30, 2022, 17:57 IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ ఐపీఎల్‌-2022లో అద్భుతంగా రాణించాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు....
30-05-2022
May 30, 2022, 16:56 IST
అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్...
30-05-2022
May 30, 2022, 16:32 IST
ఐపీఎల్‌లో అదృష్టవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది మన విజయ్‌ శంకర్‌ మాత్రమే.  కాకపోతే చెప్పండి.. వేలంలో విజయ్‌ శంకర్‌పై...
30-05-2022
May 30, 2022, 16:16 IST
ఐపీఎల్‌-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్‌ సేన​ 7...
30-05-2022
May 30, 2022, 15:24 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఆటతీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్‌లో రాజస్తాన్‌...
30-05-2022
May 30, 2022, 14:26 IST
IPL 2022 Winner GT: ‘‘మొదటి సీజన్‌లోనే మనం సిక్సర్‌ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన...
30-05-2022
May 30, 2022, 13:32 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కొత్తేం కాదు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం రేపింది....
30-05-2022
May 30, 2022, 13:28 IST
IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది గుజరాత్‌ టైటాన్స్‌. ...
30-05-2022
May 30, 2022, 12:46 IST
IPL 2022: ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ తమ తొలి సీజన్‌లో ట్రోఫీ గెలిచి సత్తా...
30-05-2022
May 30, 2022, 10:28 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన...
30-05-2022
May 30, 2022, 09:58 IST
ఐపీఎల్‌-2022కు హాజరైన ప్రేక్షకులెందరో తెలుసా?
30-05-2022
May 30, 2022, 09:04 IST
ఐపీఎల్‌-2022: విజేతలు ఎవరు? ఎవరెవరు ఎంత గెల్చుకున్నారు? 
30-05-2022
May 30, 2022, 08:37 IST
IPL 2022- Hardik Pandya Record: అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది. సీజన్‌ ఆరంభం నుంచి...
30-05-2022
May 30, 2022, 08:09 IST
‘విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది’... ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ జెర్సీ...
30-05-2022
May 30, 2022, 04:39 IST
మార్చి 28, 2022... ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ మొదటి మ్యాచ్‌... షమీ వేసిన తొలి బంతికే లక్నో సూపర్‌ జెయింట్స్‌...
29-05-2022
May 29, 2022, 23:46 IST
ఐపీఎల్‌ 15వ సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ ►ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. 131 పరుగుల లక్ష్యంతో...
29-05-2022
May 29, 2022, 23:38 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్‌ సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు...
29-05-2022
May 29, 2022, 23:10 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు.  ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా మెరవనప్పటికి పరాగ్‌...
29-05-2022
May 29, 2022, 22:20 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్‌... 

Read also in:
Back to Top