మరోసారి భారతీయుల మనసులు కొల్లగొట్టిన వార్నర్‌ భాయ్‌..! | Ganesh Chaturthi 2022: David Warner Wishes Fans On Ganesh Chaturthi | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi 2022: భారతీయుల మనసు దోచేసిన వార్నర్‌ భాయ్‌.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ..!

Aug 31 2022 4:51 PM | Updated on Aug 31 2022 5:49 PM

Ganesh Chaturthi 2022: David Warner Wishes Fans On Ganesh Chaturthi - Sakshi

David Warner: ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి భారతీయుల మనసులను కొల్లగొట్టేశాడు. గణేష్ చతుర్థి నాడు వినూత్నమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. గణనాథుడి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు డిజైన్‌ చేసిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. అక్కడ ఉన్న నా స్నేహితులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని కామెంట్‌ జోడించాడు. 

వార్నర్‌ చేసిన ఈ పోస్ట్‌కు భారతీయుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. గతంలో సినిమా పాటలకు డ్యాన్స్ వేయడం, పాపులర్‌ డైలాగ్స్‌కు మీమ్స్‌ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెంచుకున్న వార్నర్‌ భాయ్‌.. తాజాగా చర్యతో భారతీయులకు మరింత చేరువయ్యాడు.

ఐపీఎల్‌ ద్వారా తెలుగు ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న వార్నీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపర్చుకున్నాడు. వార్నర్‌ పోస్ట్‌కు తెలుగు ప్రజల నుంచి అధికమైన రెస్పాన్స్‌ వస్తుండటమే ఇందుకు నిదర్శనం. 

ఇదిలా ఉంటే, వార్నర్‌ ప్రస్తుతం స్వదేశంలో జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇవాళ జరిగిన రెండో వన్డేలో అతను 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పర్యాటక జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ తొలి వన్డేలో వార్నర్‌ అర్ధసెంచరీతో మెరిశాడు. 
చదవండి: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement