breaking news
Australian opener
-
మరోసారి భారతీయుల మనసులు కొల్లగొట్టిన వార్నర్ భాయ్..!
David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయుల మనసులను కొల్లగొట్టేశాడు. గణేష్ చతుర్థి నాడు వినూత్నమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. గణనాథుడి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు డిజైన్ చేసిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. అక్కడ ఉన్న నా స్నేహితులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని కామెంట్ జోడించాడు. వార్నర్ చేసిన ఈ పోస్ట్‌కు భారతీయుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. గతంలో సినిమా పాటలకు డ్యాన్స్ వేయడం, పాపులర్ డైలాగ్స్‌కు మీమ్స్ చెప్పడం లాంటివి చేసి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వార్నర్ భాయ్.. తాజాగా చర్యతో భారతీయులకు మరింత చేరువయ్యాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) ఐపీఎల్ ద్వారా తెలుగు ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న వార్నీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపర్చుకున్నాడు. వార్నర్ పోస్ట్‌కు తెలుగు ప్రజల నుంచి అధికమైన రెస్పాన్స్ వస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, వార్నర్ ప్రస్తుతం స్వదేశంలో జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇవాళ జరిగిన రెండో వన్డేలో అతను 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. పర్యాటక జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి వన్డేలో వార్నర్ అర్ధసెంచరీతో మెరిశాడు. చదవండి: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ -
మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్
మెల్బోర్న్: భారత్ తో జరిగే మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్టు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని పేర్కొన్నాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వార్నర్ గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నానని, బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధంగా ఉన్నానని అతడు వెల్లడించాడు. ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయగలగుతున్నానని తెలిపాడు. కాగా, మూడో టెస్టుకు మిచెల్ మార్ష్ స్థానంలో రూకీ జోయ్ బర్న్ ను తీసుకున్నారు. వార్నర్ బదులుగా ఎవరి పేరు ప్రకటించకపోవడంతో అతడు ఆడే అవకాశం కన్పిస్తోంది.