AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్

జింబాబ్వేతో బుధవారం ఉదయం జరిగిన రెండో వన్డేను ఆస్ట్రేలియా కేవలం మూడు గంటల్లోనే ముగించింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20న అన్న తరహాలో జింబాబ్వే ఇన్నింగ్స్ సాగింది. టీమిండియాపై కనీస స్థాయిలో పోరాడిన జింబాబ్వే.. ఆస్ట్రేలియా దెబ్బకు తోకముడిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆసీస్ బౌలర్ల దాటికి 27.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది.
ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. సీన్ విలియమ్స్ 29 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఆ తర్వాత సికందర్ రజా 17 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చెరో మూడు వికెట్లు తీయగా.. కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్టీవ్ స్మిత్ 43 నాటౌట్, అలెక్స్ క్యారీ 26 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే సెప్టెంబర్ 3న జరగనుంది.
DRS confirmed: Zimbabwe are all out for 96.
That's their lowest ODI score against Australia #AUSvZIM pic.twitter.com/v6kyrfXg90
— cricket.com.au (@cricketcomau) August 31, 2022
సంబంధిత వార్తలు