French Grand Prix: వెర్‌స్టాపెన్‌కు ఏడో విజయం | French Grand Prix: Max Verstappen wins French Grand Prix | Sakshi
Sakshi News home page

French Grand Prix: వెర్‌స్టాపెన్‌కు ఏడో విజయం

Jul 25 2022 2:51 AM | Updated on Jul 25 2022 2:51 AM

French Grand Prix: Max Verstappen wins French Grand Prix - Sakshi

లె కాసెలెట్‌ (ఫ్రాన్స్‌): ఈ సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తన ఖాతాలో ఏడో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 30ని:02.112 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ప్రారంభించిన లెక్‌లెర్క్‌ (ఫెరారీ) 18వ ల్యాప్‌లో నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి రేసు నుంచి నిష్క్రమించాడు. కెరీర్‌లో 300వ గ్రాండ్‌ప్రి రేసులో పాల్గొన్న మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానాన్ని పొందగా... జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచాడు. సీజన్‌లో 12 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్‌ 233 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement