FIFA WC 2022: నాలుగుసార్లు చాంపియన్‌ ఇటలీ ఎక్కడ?

Four Time FIFA WC Champions Italy Why Not Playing FIFA WC 2022 - Sakshi

ఫుట్‌బాల్‌లో ప్రతీ జట్టుకు కొందరు వీరాభిమానులు ఉంటారు. అందునా ఫిఫా వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా అవతరించిన జట్లపై అభిమానం అయితే మరీ ఎక్కువ. మరి అలాంటిది నాలుగుసార్లు విశ్వ విజేత అయిన ఇటలీ ఈసారి ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు ఎందుకు దూరమైందని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు ఫుట్‌బాల్‌లో దేదీప్యమానంగా వెలిగిన ఇటలీ ఇప్పుడు కనీసం అర్హత సాధించేందుకే నానా కష్టాలు పడుతోంది.

ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇటలీది ప్రత్యేక ప్రస్థానం. నాలుగుసార్లు జగజ్జేతగా అవతరించిన ఘనత ఇటలీ జట్టుకు ఉంది. 18 సార్లు ఫిఫా వరల్డ్‌కప్స్‌ ఆడిన ఇటలీ.. 1934. 1938, 1982, 2006లో చాంపియన్స్‌గా అవతరించింది. అలాంటి ఇటలీ ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కూడా కాలేకపోయింది. ఇక ప్రపంచకప్‌లో ఇటలీ కనిపించకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌కు అది ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఇప్పుడు చూద్దాం.

►యూఈఎఫ్ఏ ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్‌ గ్రూప్-సిలో స్విట్జర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లిథువేనియాతో కలిసి డ్రా చేసుకుంది. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్ కప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలం కావడంతో కోచ్ రాబర్టో మాన్సినీ, జట్టుపై ఒత్తిడి విపరీతంగా ఉంది.

►ఇక గతేడాది జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్‌ నుంచి విరామం తీసుకోవడానికి ముందు నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లుథువేనియాతో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. టోర్నమెంటులో విజయం సాధించాక వరుసగా బల్గేరియా, స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అంతకుముందు స్వదేశంలో లుథువేనియాతో జరిగిన మ్యాచ్‌లో 5-0తో విజయం సాధించింది.


2006 ఫిఫా వరల్డ్‌‍కప్‌

►దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అర్హత సాధించినట్టుగా కనిపించింది. అయితే, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా కావడంతో చివరి రౌండ్‌కు ముందు ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలిచాయి.

►యూరో 2020 విజయం తర్వాత నాలుగు నెలలకు నార్తరన్ ఐర్లాండ్‌-ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయింది. అదే సమయంలో బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది.


1982 ఫిఫా వరల్డ్‌కప్‌

ఇటలీ ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా అడుగంటాయి?
►నిర్ణయాత్మక ప్లే ఆఫ్ టైలో పోర్చుగల్‌తో తలపడాల్సిన ఇటలీ.. స్వదేశంలో నార్త్ మాసడోనియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓటమి పాలు కావడంతో ఫైనల్స్‌ అవకాశాలు కోల్పోవడంతో 2022 వరల్డ్‌కప్‌కు కూడా దూరమైంది.

►నార్తరన్ మాసడోనియా ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఆ జట్టును 2-0తో ఓడించిన పోర్చుగల్ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది

మరి 2018 ప్రపంచకప్‌కు ఎందుకు క్వాలిఫై కాలేదు?
2018 ప్రపంచకప్‌ కోసం జరిగిన క్వాలిపికేషన్ రౌండ్ గ్రూప్-జిలో ఇటలీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో స్వదేశంలో స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌ 0-0తో డ్రా కావడంతో 60 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది.


1938 ఫిఫా వరల్డ్‌కప్‌

చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్‌ చూడాల్సిందే

ఒక ఫుట్‌బాల్‌ ఆటగాడి కోసం ఇంతలా వెతికారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top