FIFA WC 2022: సెమీస్‌ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!

FIFA WC Qatar 2022 Semis: Schedule Prize Money Other Details - Sakshi

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. విశ్వవిజేతగా అవతరించేది ఏ జట్టు అన్న విషయం మరో వారం రోజుల్లో తేలనుంది.  కాగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మెగా ఈవెంట్‌ గత నెల 20న ఖతర్‌ వేదికగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి అర్హత సాధించిన 32 జట్లు 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడాయి. 

ఇక బ్రెజిల్‌, పోర్చుగల్‌ వంటి మేటి జట్లు క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరగగా.. మొరాకో సంచలన విజయంతో సెమీస్‌ వరకు చేరింది. డిపెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో పాటు రన్నరప్‌ క్రొయేషియా, స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో రౌండ్‌ ఆఫ్‌ 16 నుంచి సెమీస్‌ వరకు కీలక మ్యాచ్‌లలో జట్ల ప్రయాణం, తదుపరి షెడ్యూల్‌, ప్రైజ్‌మనీ తదితర అంశాలు గమనిద్దాం.

8 గ్రూప్‌లు
►గ్రూప్‌ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్‌.
►గ్రూప్‌ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్‌.
►గ్రూప్‌ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా.
►గ్రూప్‌ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా.
►గ్రూప్‌ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా.
►గ్రూప్‌ ‘ఎఫ్‌’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో.
►గ్రూప్‌ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్‌.
►గ్రూప్‌ ‘హెచ్‌’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా.

రౌండ్‌ 16కు చేరిన జట్లు ఇవే
►నెదర్లాండ్స్‌
►అమెరికా
►అర్జెంటీనా
►ఆస్ట్రేలియా
►జపాన్‌
►క్రొయేషియా
►బ్రెజిల్‌
►దక్షిణకొరియా
►ఇంగ్లండ్‌
►సెనెగల్‌
►ఫ్రాన్స్‌
►పోలాండ్‌
►మొరాకో
►పోర్చుగల్‌
►స్పెయిన్‌
►స్విట్జర్లాండ్‌

నాకౌట్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్లు
►అమెరికాపై 3-1 తేడాతో నెదర్లాండ్స్‌ విజయం.. ఆస్ట్రేలియాపై 2-1తో అర్జెంటీనా గెలుపు.. తద్వారా గ్రూప్‌- ఏ నుంచి నెదర్లాండ్స్‌, గ్రూప్‌- సి నుంచి అర్జెంటీనా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాయి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరింది.

►జపాన్‌పై విజయంతో క్రొయేషియా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరగా.. కొరియాను మట్టికరిపించి(4-1) బ్రెజిల్‌ ముందడుగు వేసింది. ఈ క్రమంలో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌, క్రొయేషియా తలపడ్డాయి. నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో సమంగా ఉండగా పెనాల్టీ షూటౌట్‌లో 4-1తో క్రొయేషియా గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది.

►సెనెగల్‌పై విజయంతో ఇంగ్లండ్‌, పోలాండ్‌పై విజయంతో ఫ్రాన్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాయి. ఇక ఇంగ్లండ్‌తో పోరులో 2-1తో పైచేయి సాధించిన ఫ్రాన్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది.

మరోవైపు.. స్పెయిన్‌పై విజయంతో క్వార్టర్స్‌ ఫైనల్‌ చేరుకున్న మొరాకో.. స్విట్జర్లాండ్‌ను ఓడించి తమతో పోటీకి దిగిన పోర్చుగల్‌ను ఓడించింది. తద్వారా 92 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా రికార్డు సృష్టించింది.

మిగిలిన షెడ్యూల్‌
►డిసెంబరు 14న మొదటి సెమీ ఫైనల్‌
అర్జెంటీనా వర్సెస్‌ క్రొయేషియా 
►డిసెంబరు 15న రెండో సెమీ ఫైనల్‌
ఫ్రాన్స్‌ వర్సెస్‌ మొరాకో
►డిసెంబరు 17న మూడో స్థానం కోసం ఎలిమినేటర్‌ మ్యాచ్‌
►డిసెంబరు 18న ఫైనల్‌  

ప్రైజ్‌మనీ వివరాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top