భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత | Sakshi
Sakshi News home page

భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత

Published Sat, Aug 27 2022 5:47 AM

FIFA lifts suspension of All India Football Federation - Sakshi

భారత ఫుట్‌బాల్‌కు ఊరట లభించింది. భారత్‌పై విధించిన నిషే«ధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. నిషేధాన్ని తొలగించాలని ‘ఫిఫా’ కౌన్సిల్‌ బ్యూరో శుక్రవారం నిర్ణయించింది.

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్‌ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement