
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ఐపీఎల్ ప్రారంభానికి ముందు మంచి అంచనాలు ఉన్నాయి. కానీ వేలం ప్రారంభం తర్వాత అవన్నీ తలకిందులయ్యాయి. భారీ ధరకు అమ్ముడుపోతాడని భావించిన వార్నర్.. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 6.25 కోట్లతో నామమాత్రపు ధరకు అమ్ముడుపోయాడు. అతని కోసం ఆర్‌సీబీ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని రీతిలో వార్నర్‌వైపు కనీసం తొంగిచూడలేదు. ముంబై ఇండియన్స్ వార్నర్‌ను దక్కించుకోవాలనుకున్నా చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకుంది. దీంతో వార్నర్ తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమ్ముడుపోయాడు. కాగా గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున వార్నర్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఇంత తక్కువ ధరకు వార్నర్ అమ్ముడవడం వెనుక అతనికి మళ్లీ అవమానం జరిగిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొన్నారు. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున వార్నర్‌కు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఆఖర్లో అవకాశాలు ఇవ్వకపోవడం జరిగింది. అంతేకాదుజట్టులో చోటు కోల్పోయిన వార్నర్ ఆఖరికి డ్రింక్స్‌బాయ్‌గా సేవలందించాడు. ఇవన్నీ చూసి వార్నర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అవమానభారంతో ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడిన వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.