
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హార్దిక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
బౌలింగ్‌లో కూడా ఓ కీలక వికెట్ హార్దిక్ పడగొట్టాడు. పాండ్యా బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు శెభాష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో హార్దిక్ దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
— Azam Khan (@AzamKhan6653) June 22, 2024