
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్.. భారత్ రెజ్లర్ గ్రేట్ ఖలీ కన్నీటిపర్యంతం అయ్యాడు. అతను ఎందుకు ఏడ్చాడన్నది అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. విషయంలోకి వెళితే.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీని.. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలివ్వాలని అడిగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖలీ చిరునవ్వుతో వారి దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజిచ్చాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే అతని మొహంలో మార్పు కనిపించింది.
అప్పటిదాకా సంతోషంగా కనిపించిన ఖలీ.. ఒక్కసారిగా దుఃఖంతో కుమిలిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఖలీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడన్నది ఎవరికి అర్థం కాలేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా 19 సెకెన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారు.
భారత్ తరపున వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో పాల్గొని 'ది గ్రేట్ ఖలీ'గా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. 'గ్రేట్ ఖలీ' అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో లెజెండరీ.. హండర్ టేకర్‌ను ఓడించి ఖలీ అప్పట్లో సంచలనం సృష్టించాడు. కాగా ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఖలీ.. 2021లో ''WWE HALL OF FAME''లో చోటు సంపాదించాడు. ఇక పలు బాలీవుడ్, హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన ఖలీ అలియాస్ దలీప్ రాణా.. పంజాబ్ పోలీస్‌లో అసెస్టింట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. ఇటీవలే రాజకీయ అరంగేట్రం ఇచ్చిన ఖలీ బీజేపీలో జాయిన్ అయ్యాడు.
what made Khali Sir cry? pic.twitter.com/mrFKUTdM5A
— Viral Bhayani (@viralbhayani77) August 12, 2022
చదవండి: Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం
Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం