#ViniciusJr: ఫుట్‌బాలర్‌ దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం

Fans Fined-Rs-5-Lakh-Banned-2-Years-Burning Effigy-Brazil Footballer - Sakshi

బ్రెజిల్‌ స్టార్‌, రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాలర్‌ వినిషియస్‌  జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్‌ లీగ్‌లో భాగంగా  మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు.

అయితే ఈ ఘటనపై స్పెయిన్‌ యాంటీ వయొలెన్స్‌ కమీషన్‌ సీరియస్‌ అయింది. లైవ్‌ మ్యాచ్‌ సమయంలో ఒక సాకర్‌ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్‌  జూనియర్‌ కు ఈ వివక్ష కొత్తేం కాదు.

ఐదేళ్ల క్రితం బ్రెజిల్‌ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్‌ మాడ్రిడ్‌, అట్లెటికో మాడ్రిడ్‌ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్‌ వినిషియస్‌ వివక్షకు గురయ్యాడు. స్పానిష్‌ క్లబ్‌ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్‌ వినిషయస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. 

చదవండి: వివాదంలో గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌ యష్‌ దయాల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top