
Courtesy: IPL Twitter
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఐదో బంతిని లియామ్ లివింగ్‌స్టోన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద అప్పటికే కాచుకొని ఉన్న అలెన్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. తాను ఎంత గొప్ప ఫీల్డర్ అనేది అలెన్ మరోసారి రుచి చూపించాడు. ఇంతకముందు సీపీఎల్, బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఫీట్స్‌నే నమోదు చేశాడు.
చదవండి: KL Rahul Stunning Catch: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ
కాగా మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో దూకుడుగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 దాటుతుందని అంతా భావించారు. కానీ ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ 5 వికెట్లతో టాప్ లేపగా.. షమీ 3 వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైశ్వాల్ 49 పరుగులతో రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 25 పరుగులతో రాణించడం.. చివర్లో మహిపాల్ లామ్రోర్ (17 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Fabian Allen- what a beauty😍 #PBKSvsRR pic.twitter.com/BzEryruxwU
— Kart Sanaik (@KartikS25864857) September 21, 2021