WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్‌ స్టార్‌ కన్నుమూత

Ex-WWE-AEW Wrestler Jaysin Strife Passes-Away After Long Health Battle - Sakshi

మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ(WWE), ఏఈడబ్ల్యూ(AEW) స్టార్‌ జైసిన్ స్ట్రిఫే(37) కన్నుమూశాడు. కొంతకాలంగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జైసిన్‌ స్ట్రిఫే గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు అతని సోదరుడు ప్రకటించాడు. జైసిన్‌కు ఏ రకమైన వ్యాధి సోకిందనేది వైద్యులు కూడా నిర్థారించేలేకపోయారని.. వైరస్‌ రూపంలో రోజు రోజుకు శరీరాన్ని తినేస్తూ బలహీనంగా తయారు చేసేదని.. మోతాదుకు మించి స్టెరాయిడ్స్‌ వాడడంతోనే మృతి చెందినట్లు పేర్కొన్నాడు.

ఇక 2004లో ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌లో అడుగుపెట్టిన జైసిన్‌ డబ్ల్యూడబ్ల్యూఈ, ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌(AEW)లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో మాగ్నమ్‌ ప్రో రెజ్లింగ్‌కు ప్రమోటర్‌గా పనిచేశాడు. ఇక జైసన్‌ చివరిసారి గతేడాది నవంబర్‌లో ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌లో పవర్‌హౌస్‌ హాబ్స్‌తో ఆడాడు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top