Euro 2024: Cristiano Ronaldo leads the way as Portugal hit six against Luxembourg - Sakshi
Sakshi News home page

Euro 2024: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్‌ ఖాతాలో రెండో విజయం  

Mar 28 2023 7:32 AM | Updated on Mar 28 2023 10:29 AM

Euro 2024: Cristiano Ronaldo Leads Way Portugal Won By 6-0 Vs Luxembourg - Sakshi

యూరో–2024 క్వాలిఫయింగ్‌ టోర్నీలో మాజీ విజేత పోర్చుగల్‌ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్‌ ‘జె’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లక్సెంబర్గ్‌తో మ్యాచ్‌లో పోర్చుగల్‌ 6–0తో గెలిచింది. కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్‌తో మెరిశాడు. ఆట 6వ, 31వ నిమిషంలో రొనాల్డో జట్టు తరపున గోల్స్‌ కొట్టాడు.

మిగతావారిలో జావో ఫెలిక్స్‌(ఆట 15వ నిమిషం), బెనార్డో సిల్వా(ఆట 18వ నిమిషం), ఒటావియో(ఆట 77వ నిమిషం), రాఫెల్‌ లావో(ఆట 88వ నిమిషం)లో గోల్స్‌ సాధించారు. కాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో ప్రస్తుతం రొనాల్డో 122వ గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. లిష్టెన్‌స్టయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్‌ చేశాడు.   

Advertisement
 
Advertisement
Advertisement