
ఇంగ్లండ్ టూర్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. చెస్టర్-లీ-స్ట్రీట్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇంగ్లీష్ జట్టు బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43) పరుగులతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో సౌథీ, లూకీ ఫెర్గూసన్, సోధి తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 1న జరగనుంది.
చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు