శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!

England Cricketer Mitch Claydon Banned For Sticking Sanitizer To The Ball - Sakshi

బంతికి శానిటైజర్‌...స్వింగ్‌ కోసం యత్నం

బౌలర్ మిచ్‌ క్లేడన్‌పై వేటు వేసిన సస్సెక్స్‌ 

లండన్‌: స్వింగ్‌ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్‌ శానిటైజర్‌ను బంతికి అంటించడంతో... ఇంగ్లండ్‌ కౌంటీ ప్లేయర్‌ మిచ్‌ క్లేడన్‌ నిషేధానికి గురయ్యాడు. సస్సెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... గత నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో 37 ఏళ్ల క్లేడన్‌పై ఆగ్రహించిన సస్సెక్స్‌ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది.
(చదవండి: ఇలా మొదలవుతోంది...)
(చదవండి: పాపం.. శానిటైజర్‌ ఎంత పని చేసింది!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top